Bhutan: పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్డౌన్
కరోనావైరస్ విజృంభిస్తుండటంతో భూటాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసుల (Covid-19) సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో బుధవారం నుంచి ఏడురోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Bhutan announces nation wide 7-days lockdown: న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తుండటంతో భూటాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసుల (Covid-19) సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో బుధవారం నుంచి ఏడురోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భూటాన్‌లోని థింపూ, పారో, లామోయింజింగ్ఖా ప్రాంతాల్లో కరోనావైరస్ సామాజిక వ్యాప్తి చెందిన నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తూ భూటాన్ (Bhutan) నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 టాస్క్‌ఫోర్సు విభాగం గుర్తింపు మేరకు ఆయా జిల్లాల మధ్య రాకపోకలపై కఠిన ఆంక్షలు విధిస్తూ భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. Also read: Parliament: శీతాకాల సమావేశాలు రద్దు
కరోనావైరస్ (Coronavirus) సామాజిక వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా 7 రోజులపాటు కఠిన లాక్‌డౌన్‌ను (7-days lockdown) విధిస్తున్నట్లు భూటాన్ ప్రధాని కార్యాలయం (Bhutan PMO) మంగళవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు దేశంలోని అన్ని పాఠశాలలు, సంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలను మూసివేయనున్నారు. జోన్ల వారీగా నిర్దేశించిన షాపుల్లో నిత్యావసర సరుకులతగ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ అదేవిధంగా.. కరోనా కేసుల తీరును టాస్క్‌ఫోర్సు, జోనింగ్ టీంలు పర్యవేక్షిస్తాయని భూటాన్ పీఎంవో తెలిపింది.
Also read: Rahul Gandhi: కరోనా కట్టడిలో భారత్ కన్నా.. పాక్, ఆప్ఘాన్‌లే నయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook