Covid Delta variant increases risks .. New reports confirm threats from the delta variant during pregnancy : కరోనా వైరస్‌ మళ్లీ తన ప్రభావం చూపుతోంది. కరోనా విషయంలో గర్భిణీలు (Pregnant women) జాగ్రత్తగా ఉండాలంటూ తాజాగా ఒక అధ్యయనం పేర్కొంది. కొవిడ్ లేని వారితో పోలిస్తే.. ఈ మహమ్మారి బారిన పడిన గర్భిణీలు నిర్జీవ శిశువులను ప్రసవించే ప్రమాదం పొంచి ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. యూఎస్‌ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ (Covid) బారిన పడే గర్భిణీలపై ఈ ప్రభావం రెండురెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అదే డెల్టా వేరియంట్ విజృంభించిన సమయంలో ఆ ముప్పు నాలుగు రెట్లు పెరిగినట్లు పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా యూఎస్‌ చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) (Center for Disease Control) మార్చి 2020 నుంచి సెప్టెంబర్ 2021 మధ్యలో జరిగిన 1.2 మిలియన్ల ప్రసవాల వివరాలను సేకరించి, విశ్లేషించన చేపట్టింది. ఇందులో 8,154 ప్రసవాల్లో శిశుమరణాలు సంభవించాయి. 


ఇందులో కూడా డెల్టా వేరియంట్ రాకముందు కోవిడ్ పాజిటివ్ వచ్చిన తల్లులకు పుట్టిన శిశువుల్లో మరణాలు తక్కువగా ఉన్నాయి. అయితే డెల్టా వేరియంట్ (Delta variant) తో బాధపడుతున్న ప్రెగ్నెంట్స్‌లో (pregnant) మాత్రం శిశుమరణాలు చాలా ఎక్కువ మొత్తంలో నమోదయ్యాయి. డెల్టా వేరియంట్‌తో ఆ మరణాల రేటు నాలుగు రెట్లు పెరిగినట్లు యూఎస్ అధ్యయనంలో తేలింది. 


Also Read : తెలంగాణకు రాబోయే 3 రోజులు వర్ష సూచన... తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు...


డెల్టా వేరియంట్ బారినపడి తల్లులు నిర్జీవ శిశువులు ప్రసవించడానికి గల కారణాలను కూడా ఈ పరిశోధన చేపట్టిన వారు వెల్లడించారు. కోవిడ్ వల్ల శిశువు శరీరంలో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉండడం.. లేదంటే ప్లాసెంటాకు రక్త ప్రసరణ (Blood circulation) సరిగా జరగకపోవడం వంటి కారణాలు ఉంటాయని అధ్యయనకర్తలు తెలిపారు.


గర్భస్థ శిశువుల్లో అధికరక్తపోటు, గుండె సమస్యలు (Heart problems) , సెప్సిస్, రక్త ప్రవాహం సరిగా జరగకపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి కూడా బయటపడ్డాయి. ఇక పుట్టిన బిడ్డలని వెంటనే చాలా రోజుల పాటూ వెంటిలేటర్ పై ఉంచాల్సి రావడం.. లేదంటే ఐసీయూలో (ICU) చేర్చించి చికిత్స చేయించాల్సి రావడం వంటి పరిస్థితులు కూడా తలెత్తాయి.


Also Read : చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపించింది.. ఆ సమయంలో జగన్ నవ్వు దేనికి సంకేతం : జగ్గారెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook