తెలంగాణకు రాబోయే 3 రోజులు వర్ష సూచన... తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు...

Rains in Telangana: తెలంగాణకు రాబోయే మూడు రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 07:04 PM IST
  • తెలంగాణకు రాగల 3 రోజులు వర్ష సూచన
    ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు
    పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
తెలంగాణకు రాబోయే 3 రోజులు వర్ష సూచన... తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు...

Rains in Telangana: తెలంగాణలో రాగల 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ (Telangana Weather) కేంద్రం వెల్లడించింది. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, కోస్త్రాంధ్ర మీదుగా ఒడిశా వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినట్లు తెలిపింది.

హైదరాబాద్ (Hyderabad) సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం( నవంబర్ 20) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, బేగంపేట్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల రహదారుల పైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.

Also Read: ఏపీలో విషాదం: కూలిన రెండు భవనాలు...ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి..

మరోవైపు ఏపీలో (AP Rains) వర్ష బీభత్సం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలను అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వరదలకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చెయ్యేరు నది ఉప్పొంగడంతో చుట్టుపక్కల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దాదాపు 30 మంది వరదల్లో గల్లంతవగా 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. పాపాఘ్ని, పెన్నా నదుల వరదతో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత పింఛ ప్రాజెక్టుతో పాటు, చెయ్యేరు నది వరదలతో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. రేణిగుంట, తిరుపతి టౌన్, స్వర్ణముఖి నదీ తీర ప్రాంతాలను కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. వరద నీరు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ముంపుకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సాయం అందించాలన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News