Fluqe Covid Variant: ఆస్ట్రేలియాలో కొత్త కోవిడ్ వేరియంట్, వేగంగా వ్యాపిస్తున్న వైరస్
Fluqe Covid Variant: కరోనా మహమ్మారి ముప్పు తొలగిపోయిందని ఊపిరి పీల్చుకోవద్దు. ఎక్కడో చోట, ఏదో ప్రాంతంలో ఏదో రూపంలో బయటపడుతూనే ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fluqe Covid Variant: దాదాపు ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి గురించి ఆందోళన కల్గించే అంశాల్లేవు. అక్కడక్కడా కరోనా వేరియంట్లు బయటపడుతున్నా అవి పెద్దగా ప్రమాదకరం కాకపోవడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ ఆస్ట్రేలియాలో వ్యాపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ కచ్చితంగా ఆందోళన రేపుతోంది. అదే కోవిడ్ కొత్త వేరియంట్ FLuQE covid variant.
ఇటీవల కరోనా కొత్త వేరియంట్ల FLiRT కాస్త ఆందోళన రేపినా ఆ తరువాత సద్దుమణిగిపోయింది. కరోనా వైరస్ అదే పనిగా మ్యూటేషన్ చెందుతూ కొత్త కొత్త వేరియంట్లతో కంగారు పెడుతోంది. ఎప్పుడైతే ఆ వేరియంట్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఉండదో జనం దానికి బలవుతుంటారు. మొన్నటివరకూ వ్యాపించిన FLiRT వేరియంట్ ఆఫ్రికన్ కరోనా వేరియంట్ జేఎన్ .1కు చెందింది. ఇందులో మూడు రకాలున్నాయి. కేపీ.2 మే నెలలో ఆస్ట్రేలియా తదతర ప్రాంతాల్లో విస్తరించింది. ఇక కేపీ.3 అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో వ్యాపిస్తున్న FLuQEవేరియంట్. ఇప్పటి వరకూ ఈ వేరియంట్ గురించి పెద్దగా వివరాలు తెలియలేదు. అయితే ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునే మరో వైరస్ కావచ్చంటున్నారు. అందుకే ఈ కొత్త వేరియంట్ ఆస్ట్రేలియా చుట్టు పక్కల దేశాల్లో వేగంగానే వ్యాపిస్తోంది.
అయితే ఫ్లర్ట్, ఫ్లూక్ కోవిడ్ వేరియంట్ల సంక్రమణంతో ప్రజల్లో ఈ వేరియంట్ పట్ల కూడా రోగ నిరోధకత పెరుగుతుందని, ఆ తరువాత మరో వేరియంట్ పుడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఈ వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది. వ్యాక్సిన్ అనేది పూర్తిగా రక్షించలేకపోతోందని తెలుస్తోంది. అంటే వైరస్‌ను పూర్తి స్థాయిలో అదుపు చేసే వ్యాక్సిన్ ఇంకా రాలేదని అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కోవిడ్ వైరస్ సంక్రమణ ఆగడం లేదు.
అందుకే ఎప్పటికప్పుడు హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని అన్ని విధాలుగా పెంపొందించుకోవల్సి ఉంటుంది. అప్పుడే వివిధ రకాల వైరస్‌ల నుంచి రక్షణ పొందవచ్చు.
Also read: ITR Download Process: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook