కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రస్తుతం భారత్‌లోనూ ప్రకంపనలు రేపుతోంది. గడిచిన 24 గంటల్లో సంభవించిన మరణాలతో ఫ్రాన్స్‌లో 20వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. 20వేల మరణాలు మార్క్ చేరుకున్న నాలుగో దేశంగా ఫ్రాన్స్ ఈ జాబితాలో చేరిపోయింది. శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగ్రరాజ్యం అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా మహమ్మారి కారణంగా  ఇప్పటికే ఇరవై వేలకు పైగా మరణాలు సంభవించడం తెలిసిందే. అమెరికాలో 7,92,759 పాజిటివ్ కేసులు, 42,514 మరణాలు, ఇటలీలో 1,81,228 కరోనా కేసులు, 24,114 మరణాలు, స్పెయిన్‌లో 200,210 కేసులు, 20,852 కరోనా మరణాలు సంభవించాయి. యూకేలో 1,24,743 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటికే 16,509 మంది కరోనా కాటుకు బలయ్యారు.  Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


వైద్యులు, అధికారులు చెప్పినట్లుగా పరిశుభత్రను పాటించడమే కరోనాను జయించేందుకు అత్యుత్తమ మార్గం. బయటకు వెళ్తే ముఖానికి కచ్చితంగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టాన్సింగ్ లాంటివి పాటిస్తే కరోనాకు చెక్ పెట్టవచ్చు. హ్యాండ్ శానిటైజర్ సైతం వాడాలి. ముఖం, కళ్లు, ముక్కును చేతులతో తాకడం చేయవద్దు. దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos