క్రికెట్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఆపై రాజకీయాల్లో వెళ్లినవారెందరో ఉన్నారు. మన హైదరాబాదీ అజారుద్దీన్, పంజాబ్ కు చెందిన నవజ్యోత్ సింగ్ సిద్ధు, యూపీకి చెందిన మహ్మద్ కైఫ్, రాజ్యసభ సభ్యుడు సచిన్ లు ముందు వరసలో కనిపిస్తారు..పాక్ లోనైతే ఏకంగా ప్రధాని పీఠంపై ఎక్కికూర్చున్నారు ఇమ్రాన్ ఖాన్. వీరందరూ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక్కడ క్రికెట్ కెరీర్ కొనసాగిస్తూనే ..ఎన్నికల బరిలో దిగి ఘన విజయం సాధించాడు. దీంతో  పార్లమెంట్ లో అడుపెట్టేందుకు బాటలు వేసుకున్నాడు.. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరినే కదా....అదేనండి మన పక్క దేశం బంగ్లాదేశ్ టీం కెప్టెన్ మష్ఫ్రే మొర్తాజా.


ఆటలోనే కాదు..ఎన్నికల గ్రౌండ్ లోనూ అదే దూకుడు
ఆటలో నిరంతరం దూకుడుగా వ్యవహరించే మొర్తాజా..ఎన్నికల గ్రౌండ్ లో అదే స్థాయిలో రాణించాడు. ఇటీవలె బంగ్లాదేశ్ లోజరిగిన ఎన్నికల్లో నరైల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇతనికి 2.71 లక్షల ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి ఫరీదుజ్మాన్‌కి కేవలం 7883 ఓట్ల మాత్రమే పోలయ్యాయి.దీన్ని బట్టి  ఎన్నికల గ్రౌండ్ లో అతను ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో అర్థమౌయ్యే ఉంటుంది..ప్రొఫెషనల్ పొలిటిషియన్స్ కు సైతం సాధ్యం కాని రీతిలో 90శాతానికిపైగా ఓట్లు తన ఖాతాలో వేసుకొని అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు..మొర్తాజా..మజాకా !!