Delta Variant: కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు అమెరికాలో ఉధృతంగా కన్పిస్తోంది. అగ్రరాజ్యంలో నమోదవుతున్న కేసుల్లో యాభై శాతంపైగా డెల్టా వేరియంట్ కావడం ఆందోళనగా ఉంది. ఇండియాలో విలయం సృ,ష్టించింది ఈ వేరియంటే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్‌కు(Corona Second Wave) కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కేసుల తీవ్రత అధికమౌతోంది. యూఎస్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 51.7 శాతం డెల్టా వేరియంట్ అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 80 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణమని తెలుస్తోంది. ఒకప్పుడు దేశంలో ఎక్కువగా కన్పించిన ఆల్ఫా వేరియంట్..ఇప్పుడు 28.7 శాతం కేసుల్లో కన్పిస్తోంది. డెల్టా వేరియంట్ (Delta Variant) అనేది వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా ఎక్కువ ప్రభావాన్ని చూపేదిగా ఉంది. రానున్న రోజుల్లో డెల్టా వేరియంట్ ప్రభావం మరింత పెరగవచ్చని అమెరికా ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఫౌసీ తెలిపారు. 


కరోనా వైరస్(Coronavirus variant)వేరియంట్ రూపు మార్చుకుని వేగంగా సంక్రమించే సామర్ధ్యాన్ని పెంచుకున్నప్పుడు..వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియను వేగవంతం చేయడమే పరిష్కారమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నాయని అంటున్నారు. అందుకే వ్యాక్సినేషన్ ఒక్కటే వివిధ రకాల వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. 


Also read: Lambda Variant: డెల్టా కంటే ప్రమాదకరమైన మరో కరోనా వేరియంట్, 30 దేశాల్లో గుర్తింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook