Fact Check: పుతిన్ కూతురు వ్యాక్సిన్ వికటించి చనిపోయిందా ? ఈ వార్తలో నిజమెంత
రష్యా పొరపాటు వల్ల పుతిన్ కూతురు చనిపోయిందా ? నిజమేంటి ఈ వార్త ప్రపంచం మొత్తం ధావనంలా వ్యాపించింది. ఇందులో నిజమేంటి ?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూతురు రష్యా తయారు చేసిన యాంటీడోట్ తీసుకోవడం వల్ల అది వికటించి చనిపోయింది అనే వార్తలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ? కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోన్న సమయంలో రష్యా ( Russia ) తొలి వ్యాక్సిన్ స్పూత్నిక్ వీ ( Sputnik V ) గురించి ప్రకటించి ప్రపంచానికి ఊరటనిచ్చింది. ఈ యాంటీ డాట్ ప్రభావం ఏంటో ప్రపంచానికి చూపించడానికి రష్యా అధ్యక్షుడు స్వయంగా తన కూతురికి యాంటీడోట్ అందించాడు. ఆ తరువాత పుతిన్ కూతురు అంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె వ్యాక్సిన్ అందుకున్న అమ్మాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ వార్త నిజం కాదు అని తెలిసింది. Adipurush: ముందు హృతిక్ రోషన్ కు కథ వినిపించారట
అదే కోవలో టోరొంటో టుడే అనే వెబ్ సైట్ లో వచ్చిన నివేదిక కూడా సోషల్ మీడియాలో ( Social Media ) బాగా వైరల్ అయింది. అదేటంటే పుతిన్ కూతురు చనిపోయింది అని.. దానికి కారణం రష్యా తయారు చేసిన స్పూత్నిక్ వీ వ్యాక్సిన్ ఆంటీడోట్ పని చేయకపోవడం వల్లే అని వార్తలు చలామణి అవుతున్నాయి. ట్విట్టర్ లో కూడా ఈ విషయం ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వార్త కూడా నిజం కాదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ గురించి ప్రకటించే సమయంలోనే పుతిన్ క్లియర్ గా చెప్పాడు.. తన కూతురికి ముందు వ్యాక్సిన్ ఇచ్చారు అని.. అప్పుడు కొంచెం టెంపరేచర్ పెరిగినా.. తరువాత నార్మల్ అయింది అని.. తన శరీరంలో యాంటీబాడీస్ పెరిగాయి అని చెప్పాడు. ఈ విషయం తెలిపిన తరువాత పలు వారాల గ్యాప్ అనంతరం ఈ ఫేక్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం దీనిపై రష్యా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.