America ex president donald trump gun firing attack incident update: అమెరికాలో ఎన్నికల జరుగుతున్నవేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా.. దుండగుడు ఆరురౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన అలర్ట్ అయి, కిందకు వంగి కూర్చున్నారు. అప్పటికి కూడా దుండగుడు కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ సీక్రెట్ ఏజెన్సీ దుండగుడిని అక్కడికక్కడే మట్టుపెట్టాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..


ట్రంప్ ను వెంటనే హుటాహుటీనీ ఆస్పత్రికి తరలించారు. ఆయన చెవికి బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తుంది. కేవలం వెంట్రుక వాసిలో ఆయన ప్రాణాలతో బైటపడినట్లు సమాచారం. కాల్పులలో ఒక సాధారణ పౌరుడు మాత్రం చనిపోయాడు. ఈ ఘటనను.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు  జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో పాటు అనేక మంది దేశాధినేతలు ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదన్నారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 


ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు , మాజీ అధ్యక్షులకు అత్యంత పకట్భంది భద్రతవ్యవస్థ ఉంటుంది. అయిన  కూడా  ఈ ఘటన జరగటం పట్ల అమెరికాలో తీవ్ర కలకలంగా మారింది. ఘటన వెనుకాల ఎవరున్నారు అనేదానిపై తీవ్ర చర్చనడుస్తోంది. ఈ ఘటన తర్వాత ట్రంప్ కూడా కాసేటి క్రితం స్పందించారు. అమెరికాలో ఇలాంటి కల్చర్ కు తావులేదన్నారు. ఈ ఘటనలకు భయపడేది లేదని తెల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అమెకన్ సీక్రెట్ ఏజెన్సీ కాల్పులకు తెగబడ్డ దుండగుడిని గుర్తించారు. థామస్ మాథ్యూ క్రూక్ అనే 20 ఏళ్ల యువకుడు ట్రంప్ పై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.


అతగాడు.. ముందుస్తు స్కెచ్ ప్రకారమే కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.  సభాస్థలి, గన్ మన్ పోజిషన్ తీసుకున్న ప్రదేశం నుంచి స్పష్టంగా కన్పిస్తుందన్నారు. దాడికి పాల్పడిన దండగుడు.. శక్తివంతమైనన సెమీ ఆటోమెటిక్ ఆయుధంతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ముష్కరుడు దాడిచేయడానికి ప్రయత్నించిన ఇంటి పైన నిచ్చేనను పోలీసులు గుర్తించారు. ట్రంప్ వచ్చేవరకువెయిట్ చేసి, పోజిషన్ తీసుకుని మరీ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దుండగుడు ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో ట్రంప్ పై కాల్పులు జరిపినట్లు సమాచారం.ఈ ఆయుధాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Read more: Snake bite: పాముపగ నిజమా..?.. 40 రోజుల్లో 7 సార్లు కాటు.. 9 వ సారి చస్తానంటూన్న వికాస్ దూబే.. మిస్టరీగా మారిన ఘటన..


 మరోవైపు భద్రత బలగాల కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు. అతనివద్ద ఎలాంటి ఐడీకార్డులు, ఫోన్ లు లేవని పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే దుండగుడి పక్కా స్కెచ్ అర్ధమౌతుంది. ఇక పోలీసులు చనిపోయిన వ్యక్తి డీఎన్ఏను సేకరించి, అతని వివరాలు రాబట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు గాయపడిన తర్వాత కూడా ట్రంప్ మరల పైకి లేచీ.. తాను ఎప్పటికి లొంగిపోనని చెప్పి .. పిడికిలీ బిగించి మరీ  నినాదాలు చేశారు. ట్రంప్ పై కాల్పుల ఘటనపై పోలీసులు హాత్యాయత్నంగా కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి