ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని చైనానే తయారుచేసిందని, దాని దుష్ప్రభావాన్ని అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది. చైనా ఆహ్వానం లేకున్నా అక్కడికి వెళ్లి వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టీమ్‌ను పంపిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారు. తమకు ఏ పాపం తెలియదని, తమ దేశంలోనూ అధికంగా కరోనా మరణాలు సంభవించాయని చైనా సైతం వాదిస్తోన్న విషయం తెలిసిందే.  Photos: బాత్‌టబ్‌లో నటి హాట్ ఫొటోషూట్ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న కరోనా వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రవేశించాడు. చైనాకు మద్దతు తెలపడంతో పాటు అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న పొరపాటును సైతం సరిదిద్దుకోవాలని సూచించడం గమనార్హం. ప్రపంచ దేశాలలాగే చైనా కూడా కరోనా వైరస్‌ విషయంలో బాధిత ప్రాంతమని వర్మ అభిప్రాయపడ్డాడు. Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!



బ్రేకింగ్: అమెరికాలో 42వేల కరోనా మరణాలు 


అయితే కరోనా లాంటి వైరస్‌ను ఎలా డీల్‌ చేయాలో చైనాకు బాగ తెలుసునని, వారికి ఆ సామర్థ్యం ఉందన్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ విషయాన్ని గుర్తించి మసలుకోవడం మంచిదని ఏకంగా అగ్రరాజ్యం అధినేతకు దర్శకుడు వర్మ చురకలు అంటించడం గమనార్హం. చైనామీద కక్షతోనే ట్రంప్‌ కట్టుకథలు అల్లుతున్నారని సోషల్‌ మీడియా వేదికంగా రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. ఈ మేరకు వర్మ చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.     జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos