YouTube Bans Donald Trumps Channel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే షాక్‌ల మీద షాక్‌లు తిన్నారు. తాజాగా యూట్యూబ్ సంస్థ కూడా అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చింది. రాజధాని వాషింగ్టన్‌లో దాడుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ ఖాతాను తాత్కాలింకంగా నిషేధించారు . దాంతో వారం రోజుల పాటు ట్రంప్ పేజీపై ఆంక్షలు అమలులోకి రానున్నాయి. తమ విధివిధానాలు ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని యూట్యూబ్ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇదివరకే డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా తొలగించగా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తాత్కాలికంగా నిషేధించారు. హింసను రెచ్చగొడుతున్నట్లుగా వీడియోలు అప్‌లోడ్ చేసిన కారణంగా ఆయన పేజీ నుంచి కొన్ని వీడియోలు సైతం తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది. మ‌రో ఏడు రోజుల పాటు ట్రంప్ ఛాన‌ల్‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌కుండా యూట్యూబ్ చ‌ర్య తీసుకుంది. సామాజిక సంఘాలు డిమాండ్ చేయడంతో ట్రంప్(Donald Trump) యూట్యూబ్ తాత్కాలికంగా నిషేధించారు.


Also Read: Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత



ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేస్తూ కొన్ని వీడియోలు ట్రంప్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఆయన యూట్యూట్(Youtube) ఛానల్‌లకు 2.77 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అమెరికాలో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ట్రంప్ ఖాతాలపై సోషల్ మీడియా సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.


Also Read: PM Modi: ఫాలోయింగ్‌లో ప్రధాని మోదీనే నెంబర్ వన్! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook