Beer Taster Job: మీరు బీర్ ప్రియులా.. అయితే ఈ జాబ్‌కు అదే అర్హత.. బీర్ తాగడమే పని.. రిక్రూట్ చేసుకుంటున్న అల్దీ కంపెనీ
Beer Taster Job: మీరు బీర్ ప్రియులా.. బీర్ తాగడమంటే చాలా ఇష్టమా.. అయితే ఈ క్వాలిఫికేషన్ చాలు ఈ జాబ్‌కి అప్లై చేయడానికి..
Beer Taster Job in Aldi Company: జర్మనీకి చెందిన సూపర్ మార్కెట్ సంస్థ అల్దీ (Aldi) 'బీర్ టేస్టర్' ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీర్ తాగే అలవాటు, దాని రుచిని రివ్యూ చేయగలిగే నైపుణ్యం ఉంటే చాలు ఈ ఉద్యోగానికి అర్హులు. పైగా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అల్ది సంస్థ మీ ఇంటికే బీర్ ప్రొడక్ట్స్ ను పంపిస్తుంది. ఆ బీర్స్‌ను టేస్ట్ చేసి వాటిపై రివ్యూలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఉద్యోగానికి ఎటువంటి వేతనం ఉండదు. జాబ్‌లో భాగంగా ఉచితంగా బీర్ తాగే సదుపాయం ఉంటుంది కాబట్టి వేతనం చెల్లించరు.
అల్దీ సంస్థకు వచ్చే కొత్త బీర్ బ్రాండ్స్‌ను 'బీర్ టేస్టర్' వద్దకు పంపిస్తుంటారు. అలా ప్రతీసారి 10 బ్రాండ్స్‌ను పంపిస్తారు. ఇందులో ఆల్కాహాల్ శాతం తక్కువ ఉండే బీర్లు, ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండే బీర్లు ఉంటాయి. ఈ బీర్లన్నింటినీ టేస్ట్ చేసి వాటిపై రివ్యూలను అల్దీ సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. బీర్ బ్రాండ్స్ సప్లైకి సంబంధించిన విషయాల్లో అల్దీ బాస్‌లు ఈ రివ్యూలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు.
అల్దీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జూలీ అష్‌ఫీల్డ్ మాట్లాడుతూ... బీర్ అంటే ప్యాషన్, ఎగ్జయిట్‌మెంట్ ఉన్న క్యాండిడేట్ కోసం తాము చూస్తున్నామని చెప్పారు. బీర్ టేస్టర్ ఇచ్చే రివ్యూల ఆధారంగా తమ బిజినెస్‌ను మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బీర్ లవర్స్‌కి ఇది గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డారు.
ఈ జాబ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే అల్దీ సంస్థ అధికారిక మెయిల్‌కు 150 పదాలతో చిన్నపాటి వ్యాసాన్ని రాసి పంపించాల్సి ఉంటుంది. మిమ్మల్నే ఎందుకు ఈ జాబ్‌కి ఎంపిక చేయాలి.. మీ ఫేవరెట్ బీర్ బ్రాండ్ ఏంటి.. ఆ బీర్‌నే ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతారు.. వంటి విషయాలపై వివరణాత్మకంగా మెయిల్ రాయాలి. ఆగస్టు 29వ తేదీ ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు. సెప్టెంబర్ 2 లోగా అల్దీ సంస్థ బీర్ టేస్టర్ ఉద్యోగానికి అభ్యర్థిని ఎంపిక చేయనుంది.
Also Read: Cooking Oil Prices: దేశంలో వంట నూనెల ధరలు మళ్లీ తగ్గే ఛాన్స్... రేపే కేంద్రం కీలక సమావేశం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook