భూమి గుండ్రంగా లేదని అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి శాస్త్రవేత్తలకు సవాల్ విసిరాడు. అంతేకాదు పాత సామగ్రితో ఒక రాకెట్‌ను తయారుచేసాడు. ఆ వ్యక్తి పేరే 61ఏళ్ల మైక్స్ హగ్స్. ఆయన తనను తాను భూమి నుంచి 1, 800 అడుగుల ఎత్తు ప్రయోగించుకోనున్నట్లు చెప్పుకున్నారు.


రాకెట్‌లో  ఒక మైలు దూరం ప్రయాణించి భూమి గుండ్రంగా లేదు.. చదునుగా (ఫ్లాట్) ఉందని నిరూపిస్తా.. " అని హగ్స్ అమెరికా మీడియాకు చెప్పారు. మైలు ఎత్తులో ఫోటోలు తీసి పంపిస్తా అని కూడా అన్నారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించడంలో ఇది తొలిదశ ప్రయత్నమే అని చెప్పారు. అంత ఎత్తు నుంచి కిందపడినా చనిపోకుండా ఉండేందుకు మోజావే ఎడారిని ఎంచుకున్నట్లు హగ్స్ వివరించారు.