Indonesia Earthquake : ఘోర భూకంపం..46 మంది మృతి, 700 మందికి తీవ్ర గాయాలు
Earthquake In Indonesia: ఇండోనేషియాలో సోమవారం సంభవించిన భూకంపం వల్ల 46 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని అంచనా వేస్తున్నారు.
Huge Earthquake In Indonesia: ఇండోనేషియాలో సోమవారం సంభవించిన భూకంపం వల్ల 46 మంది మరణించారని సమాచారం అందుతోంది. ఈ భూకంపం వల్ల 700 మందికి పైగా గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. రాజధాని జకార్తా సహా పరిసర ప్రాంతాల్లో భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై భవనాలను ఖాళీ చేయించారు.
అక్కడి లోకల్ వార్తా సంస్థల వివరాల ప్రకారం, భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ మీద 5.6గా ఉందని, ఆ భూకంప కేంద్రం జావాలోని సియాంజూర్‌లో ఉందని అంటున్నారు. ఇక గాయాలతో ఆసుపత్రికి తీసుకువెళ్లాక అక్కడ ఒక 20 మంది మరణించారని ఓ అధికారి తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక మరోపక్క భూకంపానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
ఆ వీడియోలలో విరిగిన భవనాలు, శిథిలాలు, దెబ్బతిన్న కార్లు కనిపిస్తున్నాయి. ఇక ఈ భూకంపం గురించి ఒక అధికారి మాట్లాడుతూ- ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున, ప్రస్తుతానికి ప్రజలు తమ భవనాలకు దూరంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఇక ఈ భూకంపం దెబ్బకు రాజధాని జకార్తాలో అంబులెన్స్ సైరన్‌లు నిరంతరం వినిపిస్తున్నాయి. ఇండోనేషియా ప్రభుత్వ క్విక్ రెస్పాన్స్ టీమ్ ఈ అత్యవసర పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో శుక్రవారం కూడా భూకంపం సంభవించింది అప్పుడు రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి, చాలా మందికి ఫ్రాక్చర్ అయినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
Also Read: Aftab Poonawala CCTV Footage: శ్రద్ధా శరీర భాగాలున్న బ్యాగుతో అఫ్తాబ్.. పోలీసుల చేతికి సీసీటీవీ దృశ్యాలు ?
Also Read: Prasanna Kumar: మేమలా అనలేదు, వారసుడు వివాదంపై పెదవి విప్పిన ప్రసన్న కుమార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి