Elon Musk May Fires Parag Agarwal: మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ ఉద్యోగులను లేఆఫ్స్ టెన్షన్ వెంటాడుతోంది. ట్విట్టర్‌ను ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేజిక్కించుకున్నప్పటి నుంచి ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంది. ఎప్పుడు తమ జాబ్ ఊడుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ వద్ద ప్రస్తావిస్తే... ఆయన దాన్ని తోసిపుచ్చారు. కానీ తాజాగా అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ వెలువరించిన కథనం ఇందుకు భిన్నంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరాగ్ అగర్వాల్‌ స్థానంలో కొత్త సీఈవో :


ప్రస్తుత ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్థానంలో కొత్త సీఈవోను తీసుకొచ్చే యోచనలో ఎలన్ మస్క్ ఉన్నట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఇప్పటికే కొత్త సీఈవోను ఆయన లైన్‌లో పెట్టారని పేర్కొంది. డీల్ ప్రకారం మరో ఆర్నెళ్లలో ట్విట్టర్ పూర్తిగా ఎలన్ మస్క్ హస్తగతమవుతుంది. ఆ తర్వాత కీలక మార్పులు, చేర్పులకు మస్క్ సిద్ధమవుతున్నట్లు తెలిపింది. 


ట్విట్టర్ నిర్వహణపై ప్రస్తుత మేనేజ్‌మెంట్ పట్ల తనకు విశ్వాసం లేదని ఇటీవల ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ వద్ద మస్క్ ప్రస్తావించడం గమనార్హం. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలతో మార్పు తప్పదనే సంకేతాలు పంపించినట్లయింది. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న 12 నెలల్లోగా పరాగ్ అగర్వాల్‌కు ఉద్వాసన పలికితే... 43మిలియన్ డాలర్లను మస్క్ పరాగ్‌కు చెల్లించాల్సి ఉంటుంది.


విజయ గద్దెను కూడా సాగనంపుతారా?


ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దెను కూడా సాగనంపే యోచనలో మస్క్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. న్యూయార్క్ పోస్ట్ ఇటీవలి కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఒకవేళ విజయ గద్దెను ఉన్నపలంగా తొలగిస్తే.. ఒప్పందం ప్రకారం ఆమెకు 12.5 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సంస్థ ఆమెకు ఏడాదికి 17 మిలియన్ డాలర్లు చెల్లిస్తోంది. గతవారం ట్విట్టర్ ఉద్యోగులతో ఇంటరాక్షన్ సందర్భంగా సంస్థ భవితవ్యంపై విజయ గద్దె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె కంటతడి కూడా పెట్టినట్లు కథనాలు వచ్చాయి. కాస్ట్ కట్టింగ్ పేరిట ఎక్కువ వేతనం తీసుకునే ఉద్యోగులను కూడా మస్క్ సాగనంపే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. 


Also Read: Akshaya Tritiya 2022: నేడు అక్షయ తృతీయ.. బంగారం కొనాలా వద్దా.. లక్ష్మీ దేవిని ఎలా పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి


Also Read: Horoscope Today May 3 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారు రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.