Sri Lanka Power Cut Latest Updates: శ్రీలంక దేశం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. దేశం అంతటా ఒకేసారి విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోవడంతో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (సీఈబీ) వెల్లడించింది. విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తోందని సంస్థ ప్రతినిధి నోయెల్ ప్రియాంత తెలిపారు. శ్రీలంక అంతటా విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో ఏం జరుగుతోందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీలంకలో విద్యుత్ నిలిచిపోయిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




ప్రస్తుతం అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడిస్తున్నాయి. మరికాసేపట్లో మిగిలిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఈబీ తెలిపింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కరెంట్ సరఫరా అవుతుందని హామీ ఇచ్చింది.


"కొత్మలే నుంచి బియాగామా వరకు వెళ్లే లైన్‌లో లోపం కారణంగా అన్ని చోట్లా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అనేక ప్రాంతాలకు విద్యుత్ పునరుద్ధరణ చేశాం. మిగిలిన అన్ని ప్రాంతాలకు సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం.. కొన్ని గంటల్లో పూర్తి విద్యుత్ సరఫరా అవుతుంది" అని సీఈబీ ఓ ప్రకటన విడుదల చేసింది. 


Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?


Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook