డ్రగ్స్ మాఫియా కేసులో  క్లౌవినో (43) అనే వ్యక్తి  బ్రెజిల్‌ కు చెందిన ఓ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీగా ఉంటూ బోర్ కొట్టింది.  జైలు నుంచి తప్పించుకునే బుద్ధి పుట్టి పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూతురి వేషంలో...


ఓ రోజు తనను చూసేందుకు ఖైదీ కూతురితో పాటు కుటుంబ సభ్యులు జైలుకు వచ్చారు. అయితే తన కూతురి ముఖంలా ఉన్న ఓ సిలికాన్ మాస్క్ తో పాటు ఓ టీ షర్ట్, ప్యాంట్ తెప్పించుకున్నాడు. అలా  ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం  ఖైదీ పారిపోయేందుకు తన కూతురిలా వేషం ధరించాడు. 


బెడిసికొట్టిన ప్లాన్


అలా పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా జైలు అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. చెకింగ్ నిర్వహించగా ఖైదీ మారువేషంలో ఉన్నాడని గుర్తించారు. దీంతో ఆ  ఖైదీ వేసి మాస్టర్ ప్లాన్ కాస్త  బెడిసికొట్టింది. ఇలా మళ్లీ జైలుకే పరిమితమయ్యాడు  క్లౌవినో . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీరూ చూసి ఎంజాయ్ చేయండి.