King Felipe: వరదల్లో 200 మంది మృతి.. రాజుపై గుడ్లు, బురద విసిరిన ప్రజలు
Public Booed On Spain King In Valencia: అకస్మాత్తుగా వచ్చిన వరదలు తీవ్ర విషాదం నింపగా.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమను పరామర్శించేందుకు వచ్చిన రాజుపై ప్రజలు విరుచుకుపడ్డారు. గుడ్లు, బురద విసిరారు.
Spain Floods: చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వరదలు సంభవించి వందలాది మంది మృతి చెందడంతో స్పెయిన్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడా చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రజలు సర్వస్వం కోల్పోయి దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రాజుకు చేదు అనుభవం ఎదురైంది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న ప్రజలు రాజు వచ్చిన తర్వాత వారి కోపం కట్టలు తెచ్చుకుంది. బురద, గుడ్లు వంటివి రాజుపై విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్పెయిన్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: US Elections 2024: అమెరికా అధ్యక్షుడెవరో నిర్ణయించేది ఎవరు, ఆ 3 శాతం ఓటర్ల కీలకమా, భారతీయులెటు
స్పెయిన్‌లో ఇటీవల ఉన్నఫళంగా వరదలు చుట్టుముట్టాయి. చరిత్రలో ఎన్నడూ సంభవించని రీతిలో వచ్చిన ఆకస్మిక వరదలు పెను విషాదం సృష్టించాయి. అక్కడి వరదలు 200 మందికి పైగా ప్రజల ప్రాణాలు తీశాయి. దాంతోపాటు వేలాది కుటుంబాలు వరదల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోయారు. ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో సంభవించింది. అత్యధికంగా వాలెన్సియా సమీపంలోని పైపోర్తా ప్రాంతంలో 60 మందికి పైగా మరణాలు సంభవించాయి. అక్కడి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు స్పెయిన్ రాజు నాలుగో లూయి ఫెలిప్ వెళ్లారు. వరద బాధితులను పరామర్శించే సమయంలో ఊహించని సంఘటన ఎదురైంది.
వరదలు వచ్చినా తమను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో రాజుపై తమ కోపాన్ని ప్రదర్శించారు. అక్కడే ఉన్న బురదను రాజుపై చల్లారు. గుడ్లు విసిరారు. తమ ప్రజల చావుకు కారణం మీరేనంటూ నినాదాలు చేస్తూ వరద ప్రభావిత ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అయితే వెంటనే భద్రతా సిబ్బంది రాజుకు రక్షణగా నిలిచారు. ప్రజాగ్రహాన్ని గుర్తించిన రాజు ఎలాంటి గొడవకు దిగకుండా ప్రశాంతంగా ఉన్నారు. ప్రజాగ్రహం తీవ్రంగా ఉండడంతో భద్రతా అధికారుల సూచన మేరకు అక్కడి నుంచి రాజు వెళ్లిపోయారు. అయితే ఈ సంఘటన సమయంలో అతడి సతీమణి రాణి లెతిజియా కూడా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు, వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook