US Elections 2024: ఈసారి స్వింగ్ స్టేట్స్ ఎవరివైపు, బ్లూ వర్సెస్ రెడ్ స్టేట్స్ ట్రెండ్ మారుతోందా

US Elections 2024: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలంటే సాధారణంగా అందరికీ ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశం కావడంతో సహజంగానే అక్కడ ఏం జరుగనుందనేది తెలుసుకోవాలనుకుంటారు. మరో మూడ్రోజుల్లో ఎన్నికలున్నాయి. ఈ సందర్భంగా ఏయే రాష్ట్రాల్లో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2024, 02:04 PM IST
US Elections 2024: ఈసారి స్వింగ్ స్టేట్స్ ఎవరివైపు, బ్లూ వర్సెస్ రెడ్ స్టేట్స్ ట్రెండ్ మారుతోందా

US Elections 2024: అమెరికాది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యదేశం. నవంబర్ 5న ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఇక్కడ ఎన్నికల్లో రాష్ట్రాలు కీలక భూమిక వహిస్తాయి. ప్రధాన ప్రత్యర్ధులు డెమోక్రటిక్ వర్సెస్ రిపబ్లికన్ పార్టీల మధ్య రాష్ట్రాల ఆధిక్యం కొనసాగుతుంటుంది. పార్టీల పరంగా రాష్ట్రాలను బ్లూ, రెడ్, స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. వీటి అర్ధమేంటి, ఎవరెవరికి ఏయే రాష్ట్రాల్లో ఆధిక్యం ఉందో చూద్దాం.

కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాలను బ్లూ స్టేట్స్‌గా పరిగణిస్తారు. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రోగ్రెసివ్ పాలసీలకు మద్దతు ఉంటుంది. సామాజిక న్యాయానికి ఇక్కడి ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయ ఎజెండాలు నడిపించే కేంద్రాలు ఈ రాష్ట్రాల్లో ఉంటాయి. ఇక రెడ్ స్టేట్స్ అంటే టెక్సాస్, అలబామా, వ్యోమింగ్ వంటి రాష్ట్రాలు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా సంప్రదాయ విలువ, వ్యక్తిగత స్వేచ్ఛ, పరిమితమైన ప్రభుత్వ జోక్యాన్ని ఇష్టపడతారు. రూరల్ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక స్వింగ్ స్టేట్స్ అంటే ఆరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిల్ రాష్ట్రాలు. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో అంతుచిక్కదు. స్వింగ్ స్టేట్స్ మాత్రమే ఎప్పుడూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాల్ని నిర్ణయిస్తుంటాయి.

గతంలో అంటే 2020లో జరగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్లూ , రెడ్ రాష్ట్రాలు విడిపోయాయి. డెమోక్రటిక్ అభ్యర్ధి జో బిడెన్‌కు మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా అందులో బ్లూ స్టేట్స్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రెడ్ స్టేట్స్‌లో ఉన్న మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు బ్లూ స్టేట్స్ జోన్‌లో మారడం విశేషం. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు రాగా అందులో రెడ్ స్టేట్స్ పరిధిలో వచ్చే దక్షిణ, మిడ్ వెస్ట్ రాష్ట్రాల నుంచి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇందులో ఫ్లోరిడా, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాలున్నాయి. 

ఇప్పుడు మరో మూడ్రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలనున్నాయి. బ్లూ వర్సెస్ రెడ్ స్టేట్స్ వైఖరిని మార్చే ట్రెండ్స్ చోటుచేసుకుంటున్నాయి. ఆర్ధిక పునరుద్ధరణ, ఆరోగ్యం, వాతావరణ మార్పులు వంటి అంశాలు ఓటర్లను ఈసారి ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బ్లూ స్టేట్స్ పరిధిలో కన్పించిన ఆరిజోనా, జార్జియా రాష్ట్రాలు ఈసారి కీలకంగా మారవచ్చు. ముఖ్యంగా నేరాలు, పన్నులు, గృహ నిర్మాణ స్థోమత వంటి అంశాలు ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. 

Also read: kamala harris: కమలా హారిస్ కు తెలంగాణలోని కొత్తగూడెం - భద్రాద్రి జిల్లాకు ఉన్న కనెక్షన్ ఏంటి..? ఆమె కోసం ఆ గ్రామంలో ఎందుకు పూజలు చేస్తున్నారు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News