Medicine for Coronavirus: ఫ్లోరియా యూనివర్శిటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
కరోనా వైరస్ గుట్టు రట్టయింది. వైరస్ సమర్ధవంతంగా అడ్డుకునే రెండు పదార్ధాల్ని కనుగొన్నారు. ఇక మానవ శరీరంలోకి చొరబడదని ఓ ప్రఖ్యాత యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాలివీ..
కరోనా వైరస్ ( Corona virus ) గుట్టు రట్టయింది. వైరస్ సమర్ధవంతంగా అడ్డుకునే రెండు పదార్ధాల్ని కనుగొన్నారు. ఇక మానవ శరీరంలోకి చొరబడదని ఓ ప్రఖ్యాత యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాలివీ..
ప్రపంచం మొత్తాన్ని గజగజలాడిస్తున్న కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) గురించి కీలక విషయాలు తెలిశాయి. సౌత్ ఫ్లోరిడా యూనివర్శిటీ ( South Florida university ) పరిశోధనల్లో ఇది వెలుగు చూసింది. ఈ మహమ్మారి గుట్టు విప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు శ్రమిస్తూనే ఉన్నారు చాలాకాలంగా. ఇప్పుడు తొలిసారిగా సౌత్ ఫ్లోరిడా ఆరోగ్య విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ యూచెన్ కనుగొన్న ఆవిష్కరణ సరికొత్త పరిణామాలకు దారి తీయనుంది.
కరోనా వైరస్ అనేది మానవ శరీర కణాల్లోకి ఎలా వెళ్తుంది..దీన్ని ఎలా అడ్డుకోవాలనే విషయంపై పరిశోధనలు జరిపిన అనంతరం ఎట్టకేలకు గుట్టు విప్పారు. మానవ కణాల్లోకి ప్రవేశించి, తమ సంఖ్యను పెంచుకునేందుకు కరోనా వైరస్‌కు ఉపయోగపడే రెండు కీ ప్రొటీన్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు ప్రోటీన్లను కాల్పైయిన్ ఇన్హిబిటర్ 2, కాల్పైయిన్ ఇన్హిబిటర్ 12 అనే పదార్థాలు ( Compounds which inhibits coronavirus ) సమర్థవంతంగా అడ్డుకుంటాయని తెలిపారు.
కోవిడ్ 19 వైరస్ ( సార్స్ సీవోవీ-2 ) మల్టీ లెవల్‌లో మానవ శరీరంపై దాడిచేస్తుంది. ముందుగా ఊపిరితిత్తుల లోపల ఉండే కణాలపై ఎటాక్ చేస్తుంది. అనంతరం మొత్తం కణ యంత్రాంగాన్ని స్వాధీనం చేసుకుని భారీగా వైరస్ లను ఏర్పరుస్తుంది. కణంలోకి ప్రవేశించడానికి వైరస్‌కు లైజో జోమల్ ప్రొటీజ్ క్యాథెప్సిన్ ఎల్ అనే మానవ ప్రొటీన్, కణంలో తన ప్రతులను పెంచుకోవడంలో ఎంపీఆర్‌వో అనే వైరల్ ప్రొటీన్‌ను కోవిడ్ వైరస్ ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే మనకు అందుబాటులో ఉన్న రెండు పదార్ధాలతో ఈ ప్రోటీన్లను అడ్డుకోవచ్చని సౌత్ ఫ్లోరిడా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ రెండు పదార్ధాల్ని కాల్పైయిన్ ఇన్హిబిటర్స్ 2, 12 గా పిలుస్తున్నారు.
ఈ పరిశోధనను మరికాస్త అభివృద్ధి చేస్తే..ఇక కరోనా వైరస్ కు మందు కనుగొన్నట్టే. వైరస్ అనేదే ఇక శరీరంలో చొరబడకుండజా చేయవచ్చు. అందుకే ఫ్లోరిడా యూనివర్శిటీ తాజా పరిశోధన కొత్త ఆలోచనలు రేపుతోంది. Also read: Pfizer Vaccine: ఇండియాలో ఈ వ్యాక్సిన్‌కు అవకాశం లేదా..కారణమేంటి