India Attacks China-Pak: చైనా-పాక్ పరువు తీసిన భారత్.. యూఎన్ఎస్సీలో సూపర్ కౌంటర్
Jaishankar Speech In Unsc: యూఎన్ఎస్సీలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ సూపర్ కౌంటర్ ఇచ్చింది. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమిచ్చిన దేశానికి ఐక్యరాజ్యసమితిలో నీతులు చెప్పే హక్కు లేదని స్ఫష్టం చేసింది. చైనాపై కూడా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఫైర్ అయ్యారు.
Jaishankar Speech In Unsc: ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చింది. బుధవారం పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన తర్వాత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. చైనా, పాకిస్థాన్‌లపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి పాల్పడిన వారిని సమర్థించేందుకు.. వారికి సహాయం చేసేందుకు బహుముఖ వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో 'అంతర్జాతీయ శాంతి, భద్రత, సంస్కరించిన బహుపాక్షికత కోసం కొత్త ధోరణి' అనే అంశంపై బహిరంగ చర్చకు నాయకత్వం వహించిన జైశంకర్.. ఉగ్రవాదం సవాల్‌పై ప్రపంచం మరింత బాధ్యతతో కలిసి వస్తోందన్నారు.
కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చారు. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమిచ్చిన, పొరుగు దేశ పార్లమెంటుపై దాడి చేసిన దేశానికి ఐక్యరాజ్యసమితిలో 'బోధించే' అర్హత లేదని ఆయన అన్నారు. ఇది సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి కచ్చితంగా వర్తిస్తుందన్నారు.
మహమ్మారి, వాతావరణ మార్పు, సంఘర్షణ లేదా ఉగ్రవాదం వంటి మన కాలంలోని ప్రధాన సవాళ్లపై దాని సమర్థవంతమైన ప్రతిస్పందనపై ఐక్యరాజ్యసమితి విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని జైశంకర్ అన్నారు. సంస్కరణలు నేటి అవసరం అని.. గ్లోబల్ సౌత్ ముఖ్యంగా భారతదేశం వల్లే అదే సంకల్పాన్ని కలిగి ఉందని తాను కచ్చితంగా అనుకుంటున్నానని చెప్పారు. భద్రతా మండలిలో సమాన ప్రాతినిధ్యం, సభ్యత్వం పెంపుదల అనే అంశం గత మూడు దశాబ్దాలుగా UNGA ఎజెండాలో ఉందని మనందరికీ తెలుసన్నారు. కానీ సంస్కరణలపై చర్చ లక్ష్యం లేకుండా మారిందన్నారు.
'వాస్తవ ప్రపంచం ఇంతలో నాటకీయంగా మారిపోయింది. భద్రతా మండలిలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల సభ్య దేశాలకు స్థిరమైన ప్రాతినిధ్యం ఉండాలి..' అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు.
Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ బహుమతి.. 18 నెలల డీఏ పెండింగ్ కేంద్ర నిర్ణయం..?
Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook