Shinzo Abe: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. షింజో అబేపై కాల్పులు జరిగాయి. దుండగుడు అతనిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. పశ్చిన నారా  నగరంలో ఓ సభలో షింజో అబే మాట్లాడుతుండగా అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో షింజో ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షింజో అబేను వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లుగా ప్రకటించారు.  జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈ కాల్పుల ఘటన జరిగింది. కాల్పులు జరిగిన దుండగుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నారా నగరంలో లిబరల్ డెమొక్రిటిక్ పార్టీ అభ్యర్థుల తరపున షింజో అబే ప్రచారం చేస్తున్నారు. సభలో మాట్లాడుతూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. ఆ సమయంలో కాల్పుల శబ్దం వినిపించింది. దుండగుడు కాల్పులు జరపడంతో అతని ఛాతీలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. రక్తం కారుతూ పడిపోయిన షింజో అబేను సమీపంలోకి హాస్పిటల్ కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. హాస్పిటల్ కు తీసుకెళ్లిన సమయానికే అబేదో కదలికలు లేవని వైద్యులు చెప్పారు.


షింజో అబేను వెనుకనుంచి కాల్పినట్లు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అబేపై కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.