Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ (75) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను దక్షిణ కాలిఫోర్నియా(Southern California) ఆస్పత్రిలో చేర్పించారు. కొవిడ్‌(Covid)కు సంబంధం లేని ఇతర ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లింటన్‌(Bill Clinton) ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది క్లింటన్‌కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: WHO Experts Team: కరోనా మూలాల అణ్వేషణకు డబ్ల్యూహెచ్‌వో చివరి ప్రయత్నం


రెండుసార్లు అధ్యక్షుడిగా సేవలు
అమెరికా అధ్యక్షుడి(America President)గా బిల్‌క్లింటన్‌ వరుసగా రెండు పర్యాయాలు (1993-2001) సేవలందించారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతి నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్‌ సర్జరీ(Bypass surgery) చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో 2005లోనూ తిరిగి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టంట్లు అమర్చారు. తర్వాత కొన్ని రోజులకు కోలుకున్న బిల్‌క్లింటన్‌ పూర్తి ఆరోగ్యంగా కనిపించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రచారంలోనూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌(Hillary Clinton‌) తరపున పలుసార్లు ప్రచార బాధ్యతలను బిల్‌క్లింటన్‌ చేపట్టారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook