WHO Experts Team: కరోనా మూలాల అణ్వేషణకు డబ్ల్యూహెచ్‌వో చివరి ప్రయత్నం

WHO Experts Team: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. చైనాలోని వుహాన్ నుంచి లీకైందా లేదా సహజసిద్దంగా వ్యాపించిందా. ఇప్పుడీ విషయమే తేలాల్సి ఉంది. డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడా పనిలో నిమగ్నమైంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2021, 06:00 AM IST
  • కరోనా మూలాల అణ్వేషణకై డబ్ల్యూహెచ్‌వో మరోసారి ప్రయత్నం
  • ప్రపంచవ్యాప్తంగా 25మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు
  • ఇండియా నుంచి మాజీ ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ ఎంపిక
WHO Experts Team: కరోనా మూలాల అణ్వేషణకు డబ్ల్యూహెచ్‌వో చివరి ప్రయత్నం

WHO Experts Team: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. చైనాలోని వుహాన్ నుంచి లీకైందా లేదా సహజసిద్దంగా వ్యాపించిందా. ఇప్పుడీ విషయమే తేలాల్సి ఉంది. డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడా పనిలో నిమగ్నమైంది.

కరోనా మహమ్మారి(Corona Pandemic)మొత్తం ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తోంది. ఇంతటి పెను విపత్తుకు కారణమైన ఈ వైరస్ చైనాలోని వుహన్ నగరం నుంచి విస్తరించింది. అయితే ఈ వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి విస్తరించిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ మూలాల్ని కనుక్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు మరోసారి ఆ పనిలో పడింది. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీకైందా లేదా సహజసిద్దంగా సంక్రమించిందా తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.ఇందులో భాగంగా వివిధ వైరస్‌ల గుట్టు తేల్చేందుకు శాస్త్రవేత్తలు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం కరోనా వైరస్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో విస్తరిస్తున్న వైరస్‌ల పుట్టుకపై అధ్యయనం చేయనుంది. వైరస్‌ల పుట్టుకపై అధ్యయనాలు ఎలా చేయాలనేది సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు కొన్ని మార్గదర్శకాల్ని రూపొందించింది. ఈ బృందంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 7 వందల దరఖాస్తులు చేరగా..25 మందిని డబ్ల్యూహెచ్‌వో(WHO Experts Committee)ఖరారు చేసింది. 

డబ్ల్యూహెచ్‌వో(WHO)సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఆరిజన్స్ ఆఫ్ నోవెల్ పాథోజెన్స్ స్థూలంగా చెప్పాలంటే సాగోగా పిలుస్తారు. ఐసీఎంఆర్ నుంచి గత ఏడాది పదవీ విరమణ చేసిన డాక్టర్ రామన్ గంగఖేడ్కర్ ఈ బృందంలో ఎంపికయ్యారు. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో రామన్‌కు పేరుంది. నిఫా వైరస్, కరోనా వైరస్ నియంత్రణలో రామన్ కీలకపాత్ర పోషించారు. గతంలో హెచ్‌ఐవీపై ఆయన చేసిన పరిశోధనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. కరోనా మూలాల్ని కనుక్కొనేందుకు ఇదే ఆఖరి అవకాశమని డబ్ల్యూహెచ్‌వో భావిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో విచారణలో ఏమైనా రాజకీయపరమైన అవకతవకలు జరిగితే సహించేది లేదని చైనా ఇప్పటికే హెచ్చరించింది. డబ్ల్యూహెచ్‌వో బృందానికి శాస్త్రీయంగా మద్దతిస్తామని స్పష్టం చేసింది.

Also read: దక్షిణ తైవాన్‌లో తీవ్ర విషాదం: భవనంలో చెలరేగిన మంటలు...46 మంది మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News