Four Day Work Week: ప్రస్తుతం కాలంలో వర్క్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునేందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి ఎక్కువ సమయంలో కేటాయించడం కుదరడం లేదు. ఐటీ ఉద్యోగులు ఐదు రోజులు కష్టపడి చేస్తే.. వారంతంలో వచ్చే రెండు వీక్‌లు ఇలా వచ్చి అలా ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో పలు కంపెనీలు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పాయి. వారానికి నాలుగు రోజులే పనిచేసేలా రూల్స్ మార్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసి.. మిగిలిన రోజుల్లో విశ్రాంతి తీసుకునేలా బ్రిటన్‌లో 61 కంపెనీలు 'పైలట్ స్కీమ్'ను ఇప్పటికే ప్రారంభించాయి. ఇప్పుడు ఈ స్కీమ్‌పై తమ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాయి. ఈ స్కీమ్ పూర్తిగా విజయవంతమైందని కంపెనీలు వెల్లడించాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న 61 కంపెనీలలో చాలావరకు ఈ వర్కింగ్ మోడల్‌కు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని అందించాయి. పైలెట్ స్కీమ్ సక్సెస్ కావడంతో ఇదే తరహాలో వారానికి నాలుగు రోజులు పని విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి. 56 కంపెనీలు మరికొన్నాళ్లు ఈ పని విధానాన్ని కంటిన్యూ చేయనుండగా.. 18 కంపెనీలు మాత్రం పర్మినెంట్‌గా నాలుగు రోజుల పని విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. 


గతేడాది బ్రిటన్‌లో 4 రోజుల వర్కింగ్ మోడల్‌ను అమలు చేయడానికి నాన్-ఫైనాన్షియల్ సంస్థ 'ఫోర్ డే వీక్ గ్లోబల్' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనికింద దేశంలోని మొత్తం 61 కంపెనీలకు చెందిన 3 వేల మంది ఉద్యోగులు ఒకే జీతంతో 4 రోజులు పని చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ ట్రయల్ జూన్ నుంచి డిసెంబర్ 2022 వరకు కొనసాగింది. దాదాపు 91 శాతం కంపెనీలు ఈ పైలట్ ప్రాజెక్ట్‌కు అనుకూలంగా స్పందించాయి. ఈ మోడల్‌ను తాము చాలా ఇష్టపడ్డామని.. భవిష్యత్తులో కొనసాగిస్తామని వెల్లడించాయి. 


నాలుగు రోజుల వర్కింగ్ మోడల్‌పై పరిశోధన చేస్తున్న ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జూలియట్ స్కోర్ మాట్లాడుతూ.. ఈ మోడల్ వివిధ కార్యాలయాల్లో అమలు చేశామని.. ప్రతిచోటా దాదాపు సక్సెస్ అయిందన్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌లో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారని చెప్పారు. వారానికి నాలుగు రోజులు పని చేయడం వల్ల ఉద్యోగులకు ఎక్కువ విశ్రాంతి లభించిందని నివేదిక వెల్లడైందన్నారు. 


దీనితో పాటు ఉద్యోగులు నిద్ర సమస్య నుంచి కూడా ఉపశమనం పొందారు. ఫోర్ డేస్ వర్కింగ్ మోడల్ విజయవంతం కావడంతో.. దాదాపు 91 శాతం కంపెనీలు ఈ విధానాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జూలియట్ వెల్లడించారు. కొన్ని కంపెనీలు మరికొన్ని రోజులు చూడాలని ఆలోచిస్తున్నాయని.. 4 శాతం కంపెనీలు మాత్రమే ఇకపై కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాయని తెలిపారు. ఈ విధానం వల్ల పదేపదే కంపెనీలు మారే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిందన్నారు.


Also Read: Aadhaar Card Update: ఆధార్‌లో కీలక మార్పులు.. ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా..?  


Also Read: Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook