Faisalabad Incident Video: పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో దారుణం జరిగింది. దుకాణంలో చోరీకి పాల్పడేందుకు వచ్చారన్న అనుమానంతో నలుగురు మహిళలపై దాడి చేసిన ఘటన పాక్ లో జరిగింది. అయితే ఈ విషయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమను వివస్త్రలను చేసి, దాడి చేశారని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. తన దుకాణంలో దొంగతనానికి వచ్చి తనపై దాడికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాలు వస్తున్నాయి. దుకాణ దారుడిపై ఆ మహిళలు దాడి చేయడం సహా షాప్ లోకి వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యిందని.. ఆ మహిళలే తమ వస్త్రాలను చింపుకొని గొడవకు దిగారని కొందరి వాదన. ఈ వార్తల్లో నిజమెంతో తెలుసుకుందాం.


ఏం జరిగిందంటే?


మహిళల కథనం ప్రకారం.. చిత్తు కాగితాలను ఏరుకునే నలుగురు మహిళలు సోమవారం.. పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ లోని బావా చౌక్ మార్కెట్ కు వెళ్లారు. దాహం వేయడంతో ఉస్మాన్‌ ఎలక్ట్రిక్‌ స్టోర్‌లోనికి వెళ్లి మంచి నీళ్లు అడిగారట. అయితే, దొంగతనం చేయడానికే వారు వచ్చారంటూ దుకాణ యజమాని సద్ధాం.. మరికొందరు కలిసి దాడికి పాల్పడ్డారు.


ఆ మహిళలను వీధిలోకి లాక్కొచ్చి, వివస్త్రలను చేసి దాడి చేసినట్లు ఆ మహిళలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలను కుదిపేసింది. కాగా, ఘటనకు సంబంధించి ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.


‘అసలు ఏం జరిగిందంటే?’


ఫైసలాబాద్ ఘటన అంటూ సోషల్ మీడియాలో ఓ సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో ప్రకారం.. నలుగురు మహిళలు ఓ దుకాణంలో తోసుకుంటూ వచ్చారు. ఆ షాప్ యజమాని అనుమతి లేకుండా లోపలికి వెళ్లారు. ఆ మహిళలు తన దుకాణంలో చోరీకి వచ్చారని గమనించిన యజమాని.. వెంటనే బయటకు వచ్చి, షాప్ తలుపు మూసేశాడు.


ఆ మహిళలు బయటకు రాకుండా.. తలుపు వేసి చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు. అదే సమయంలో ఆ మహిళలు షాప్ నుంచి బయటకు వచ్చి.. యజమానిపై దాడి చేశారు. అందులో ఓ మహిళ తనంతట తానే వివస్త్రను చేసుకుంటూ.. షాప్ యజమానిపై దాడి చేసింది. ఆ తర్వాత మరో మహిళల తన బట్టలను తాను చింపుకొని గొడవ చేయసాగింది.



అయితే సీసీ టీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ మహిళలు డబ్బులు కోసం కావాలనే అలా చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి పోలీసులు నిజనిర్ధారణ చేయాల్సి ఉంది.  


Also Read: Ukraine Dispute: ఉక్రెయిన్ జోలికొస్తే..సహించేది లేదంటూ అమెరికా వార్నింగ్


Also Read: Rohingya Refugees: ఫేస్‌బుక్‌పై భారీగా పరువు నష్టం దావా వేసిన రోహింగ్యా శరణార్ధులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook