Rohingya Refugees: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. జీవితాలు నాశనమయ్యాయని..నష్ట పరిహారం చెల్లించాలంటూ ఫేస్‌బుక్‌పై రోహింగ్యా శరణార్ధులు దావా వేశారు.
హింసకు గానీ, హింసను ప్రేరేపించే దృశ్యాలకు గానీ స్థానం లేదని చెప్పే ఫేస్‌బుక్ మాధ్యమంపైన ఆ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్‌కు ఊహించని షాక్ తగిలింది. జీవితాలు నాశనమయ్యాయని..150 బిలియన్ డాలర్లు అంటే అక్షరాలా పది లక్షల కోట్లు చెల్లించాలని రోహింగ్యా శరణార్జులు కేసు వేశారు.
మయన్మార్‌లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్ వేదికగా పెద్దఎత్తున ప్రచారం నడిచిందని..దీన్ని నియంత్రించడంలో ఫేస్‌బుక్ ఘోరంగా విఫలమైందనేది రోహింగ్యాల ఆరోపణ. అంతేకాకుండా తమపై హింసను ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషించిందని ఆరోపించారు. యూకే, యూఎస్‌లో పెద్ద సంఖ్యలో రోహింగ్యా శరణార్ధులు శాన్‌ఫ్రాన్సిస్కో న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. లండన్‌లోని ఫేస్‌బుక్ కార్యాలయానికి నోటీసులు అందించారు. 2013లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారమైన కొన్ని ఫేస్‌బుక్ ప్రచారాలను కోర్టుకు ఆధారాలుగా సమర్పించారు. మయన్మార్‌లో ఫేస్‌బుక్‌కు 2 కోట్లమందికి పైగా యూజర్లు ఉన్నారు. సమాచారం షేరింగ్ ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంది ఫేస్‌బుక్. 2017 ఆగస్టులో మిలట్రీ ఆక్రమణ సమయంలో చెలరేగిన హింసతో పెద్దఎత్తున మరణాలు, అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. ఊళ్లకు ఊళ్లు తగలబడ్డాయి. దాదాపు ఏడున్నర లక్షలమంది రోహింగ్యాలు దేశం విడిచి పారిపోయారు. ఈ పరిస్థితికి ఫేస్‌బుక్ కారణమనేది ప్రధాన ఆరోపణ.
ఐక్యరాజ్యసమితి(UNO)మానవ హక్కుల దర్యాప్తు సంఘం కూడా 2018లో ఈ మొత్తం హింసకు ఫేస్‌బుక్(Facebook)ప్రచారమే కారణమని తేల్చింది. ఓ అంతర్జాతీయ మీడియా హౌస్ చేపట్టిన దర్యాప్తులో కూడా ఇదే విషయం ధృవీకరణైంది.ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా నేరారోపణలపై ఓ కేసు దాఖలు చేసింది. రోహింగ్యాలకు(Rohingyas)వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఫేస్‌బుక్ ఎక్కౌంట్ల వివరాల్ని సమర్పించాలని అమెరికా ఫెడరల్ కోర్టు ఆదేశించింది. అయితే ఫేస్‌బుక్ ఇప్పుడీ విషయంపై ఇంకా స్పందించలేదు. గతంలో అంటే 2018లో మాత్రం మయన్మార్‌లో తప్పుడు ప్రచారం, సమాచారాన్ని అడ్డుకోవడంలో, వ్యతిరేక ప్రసంగాల్ని నియంత్రించడంలో ఆలస్యం చేశామని అంగీకరించింది. మయన్మార్ మిలిటరీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎక్కౌంట్లను నిషేధించడంలో ఆలస్యం జరిగిందని ఒప్పుకుంది. అమెరికా ఇంటర్నెట్ చట్టంలోని సెక్షన్ 230 ప్రకారం యూజర్ పోస్ట్ చేసే కంటెంట్‌పై మాత్రమే ఫేస్‌బుక్‌కు నియంత్రణ ఉంటుంది. మూడవ వ్యక్తి చేసే కంటెంట్‌ను నియంత్రించలేదు. మరిప్పుడు రోహింగ్యాల వేసిన దావాలో(Rohingya sue on Facebook)ఏం జరుగుతుందనేది చూడాలి.
Also read: NASA: నాసా కొత్త అస్ట్రోనాట్ టీంలో భారత సంతతి వ్యక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి