Fuel tanker blast in Sierra Leone capital kills at least 91: ఆయిల్ ట్యాంకర్ పేలడం(fuel tanker blast)తో..పశ్చిమాఫ్రికాలోని సియారా లియోన్‌ రాజధాని రక్తసిక్తమయ్యింది. ఈ ఘటనలో 91 మంది మరణించినట్లు సమాచారం. ఎక్కడ చూసినా మృతదేహాలు, కాలిపోయిన శరీర భాగాలే దర్శనమిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సియారా లియోన్‌ రాజధాని ఫ్రీటౌన్‌(Freetown)లో కొద్ది గంటల క్రితం ఓ ఇంధన ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. అయితే అందులోని ఆయిల్ లీకవుతుండటంతో పలువురు అక్కడికి చేరి ఆ దాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆ ట్యాంకర్‌(oil tanker) ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. దీంతో ఇంధనాన్ని సేకరించేవారు తునాతునకలయ్యారు. అక్కడి దుకాణాలకు, రోడ్డున వెళ్లేవారికి సైతం మంటలంటుకున్నాయి. 


Also read: Yemen Clashes: యెమెన్​లో ఆగని ఘర్షణలు...200 మంది మృతి!


ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 91 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. విపత్తు నిర్వహణ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. పట్టణ మేయర్‌ పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ఆ దేశాధ్యక్షుడు జూలియస్‌ మాడా బియో(Julius Maada Bio) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలు, క్షతగాత్రులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన.. కాప్26 వాతావరణ సదస్సు కోసం స్కాట్​లాండ్​లో ఉన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook