Gender Change: అదొక విచిత్రమైన ఊరు. డొమినికన్ రిపబ్లిక్ దేశంలోని లా సేలినస్ గ్రామం. నిర్ణీత వయస్సు దాటిన తరువాత ఇక్కడి అమ్మాయిల జెండర్ మారిపోతుంటుంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. ఆ వివరాలు పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీనేజ్ అనేది యువతీ, యువకులకు ఓ అందమైన అనుభవం. యువతీ-యువకుల్లో మార్పులు వచ్చేది అప్పుడే. గొంతు మారుతుంది. బాహ్య లక్షణాల్లో మార్పులు వస్తుంటాయి. అయితే ఆ సీక్రెట్ ఊర్లో మాత్రం నిర్ణీత వయస్సు తరువాత అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోతుంటారు. ఆశ్చర్యపోతున్నారా..నమ్మలేకపోతున్నారా..నిజమే. డైలీ మెయిల్ కధనం ప్రకారం..డొమినికన్ రిపబ్లిక్ దేశంలో లా సెలినస్ అనే గ్రామంలో జరుగుతున్న వ్యవహారమిది. ఈ గ్రామంలో ఓ నిర్ణీత వయస్సు దాటిన తరువాత కొంతమంది అమ్మాయిల జెండర్ మారిపోతుంటుంది. అబ్బాయిలుగా మారిపోతున్నారు.సైంటిస్టులు కూడా దీని వెనుక మర్మమేంటో చెప్పలేకపోయారు. 


12 ఏళ్ల వయస్సులో వస్తున్న మార్పులు


ఈ ఊరిలోని చాలామంది అమ్మాయిలు 12 ఏళ్ల వయస్సుకు చేరేసరికి అబ్బాయిలుగా మారిపోయారు. అమ్మాయిలు..అబ్బాయిలుగా మారే ఈ రోగం వెనుక కారణం అంతుబట్టక గ్రామస్థులు సమస్యలెదుర్కొంటున్నారు. ఈ ఊరు సముద్రతీరాన ఉంది. ఈ ఊరి జనాభా 6 వేలు. ఈ ఆశ్చర్యకరమైన, విడ్డూరమైన పరిణామాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులకు ఈ ఊరు ప్రాధాన్యతగా మారింది. ఇదొక అనువంశిక పరిణామమంటున్నారు వైద్యులు. 


ఈ రోగం బారిన పడిన పిల్లల్ని స్థానికంగా సూడో హమోఫ్రోడాయిట్‌గా పిలుస్తున్నారు. ఏ అమ్మాయిల్లో అయితే ఈ పరిణామం సంభవిస్తుందో వారిలో..ఓ వయస్సు తరువాత అబ్బాయిల్లా అంగాలు తయారవుతుంటాయి. ఆ అమ్మాయిల గొంతు మారిపోతుంది. ఈ అంతుచిక్కని వ్యాధితో ఊర్లో ప్రతి 90 మందిలో ఒకరు ఇబ్బంది పడుతున్నారు. 


Also read: America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత..ఆరుగురు మృతి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి