America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత..ఆరుగురు మృతి..!

America Gun Fire: అమెరికాలో కాల్పుల సంస్కృతి కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాల్పుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 8, 2022, 04:09 PM IST
  • అమెరికాలో కాల్పుల సంస్కృతి
  • మరోసారి కాల్పుల మోత
  • ఆరుగురు మృతి
America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత..ఆరుగురు మృతి..!

America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మెక్సికో వీధుల్లో దుండగులు తుపాకులతో వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. దుండగుల కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఐదుగురు స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. మరొకరిని వృద్ధురాలిగా గుర్తించారు. గువానాజువాటో వీధుల్లో ఈఘటన జరిగింది.

మృతుల్లో విద్యార్థులంతా 16 నుంచి 18 ఏళ్ల వారిగా గుర్తించారు. మృతులంతా బారోనే కమ్యూనిటీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇటీవల గువానాజువాటోలని సెలాయాలో ప్రతీకార దాడుల్లో 11 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలే ఉన్నారు. డ్రగ్స్‌, చమురు దొంగతనాలతోనే గ్యాంగ్ వార్‌లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే కాల్పుల ఘటన జరిగి ఉంటుందని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు.

2006 డిసెంబర్ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మిలిటరీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్‌తో ఇప్పటిదాకా మూడున్నర లక్షల హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. వరుస ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బయటకు సైతం వచ్చేందుకు జంకుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు.

Also read: Amazon Monsoon Carnival Sale: శాంసంగ్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ..అమెజాన్‌లో పది వేలకే

Also read:Pawan Comments on 10th Results: ఏపీలో పది ఫలితాలపై దుమారం..పవన్ కళ్యాణ్‌ ఏమన్నారంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News