Data Breach Exposed: సైబర్ హ్యాక్‌కి గురైన `గో డాడీ`.. 1.2మిలియన్ల కస్టమర్ల డేటా చోరీ
GoDaddy data breach exposed:గోడాడీ నెట్‌వర్క్‌లో అనధికార థర్డ్ పార్టీ యాక్సెస్‌తో 1.2 మిలియన్ల కస్టమర్ల డేటా చోరీకి గురైంది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
GoDaddy data breach exposed: ప్రముఖ వెబ్ హెస్టింగ్ కంపెనీ, ఇంటర్నెట్ డొమైన్ రిజిస్ట్రార్ గో డాడీ (GoDaddy Inc)సైబర్ హ్యాక్‌కు గురైంది. దాదాపు 1.2 మిలియన్ల Managed Wordpress కమస్టర్ల డేటా చోరీకి గురైందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్‌కు వెల్లడించిన వివరాల్లో గోడాడీ సంస్థ పేర్కొంది. WordPress హోస్టింగ్‌లో అనధికారిక థర్డ్ పార్టీ యాక్సెస్‌ను గుర్తించామని.. కస్టమర్ల ఈమెయిల్స్, నంబర్స్, అడ్మిన్ పాస్‌వర్డ్స్, ఎస్ఎస్ఎల్ ప్రైవేట్ కీస్‌కి సంబంధించిన డేటా ప్రమాదంలో పడినట్లు తెలిపింది. నవంబర్ 17న సైబర్ హ్యాక్‌ను (Cyber hack) గుర్తించామని... ఆ వెంటనే ఓ ఐటీ ఫోరెన్సిక్ కంపెనీ సాయంతో దీనిపై విచారణ ప్రారంభించామని స్పష్టం చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 6న మొదటిసారి గో డాడీ (GoDaddy Inc) కస్టమర్ల డేటా హ్యాక్‌కి గురైనట్లు అనుమానిస్తున్నామని ఆ సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ దిమెత్రియస్ వెల్లడించారు. దీనిపై లోతుగా విచారణ జరిపేందుకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు ప్రైవేట్ ఐటీ ఫోరెన్సిక్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. హ్యాక్‌కి గురైనట్లు అనుమానిస్తున్న అన్ని క్రెడిన్షియల్స్‌ను రీసెట్ చేస్తున్నామని... కస్టమర్లకు కొత్త ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్పారు. ఈ ఘటన నుంచి తాము పాఠం నేర్చుకుంటామని... భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read: Alert: మీకు పెన్షన్ వస్తుందా..? అయితే నవంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం!
'యాక్టివ్ కస్టమర్స్‌కు సంబంధించిన sFTP, డేటాబేస్ యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్ బహిర్గతమయ్యాయి. వాటిని మేము రీసెట్ చేస్తాం. ఎస్ఎస్ఎల్ ప్రైవేట్ కీస్ కూడా బహిర్గతమైనందునా కస్టమర్లకు కొత్త సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం జరుగుతుంది.' అని గోడాడీ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. గో డాడీ సైబర్ హ్యాక్ (Cyber Hack) బారినపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో AWS error కారణంగా గోడాడీ సర్వర్స్ డేటా బహిర్గతమైంది. 2020లో దాదాపు 28 వేల యూజర్ అకౌంట్స్ డేటా చోరీకి గురైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook