Good News: ప్రపంచమంతా ఒమిక్రాన్ ముప్పు భయం పట్టుకుంది. శరవేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదని గుడ్‌న్యూస్ అందిస్తున్నారు డాక్టర్ ఫహీమ్ యూనుస్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు చాలా దేశాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ క్రమంలో టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణులు డాక్టర్ ఫహీమ్ యూనుస్ శుభవార్త అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ డేటా అధ్యయనం (Omicron study)చేసి..ఆందోళన అవసరం లేదని చెప్పారు. కేసుల తీవ్రత పెరుగుతున్నప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కుగానే ఉందని డాక్టర్ ఫహీమ యూనుస్ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని ఒమిక్రాన్ వేరియంట్ కేసులపై చేసిన అధ్యయనం వివరాల్ని విశ్లేషించారు. వివిధ అధ్యయాల్లో ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉంటుందని తేలిందన్నారు. ఈ అధ్యయనంలో 91 శాతం డెల్టా వేరియయంట్ బాధితులతో పోల్చి చూసినప్పుడు..ఒమిక్రాన్ బాధితుల్లో 31 శాతం మాత్రమే తీవ్ర శ్వాసకోశ వ్యాధులున్నాయని డేటాలో తేలిందన్నారు. డెల్టా వేరియంట్ సోకిన రోజులకు 7 రోజుల్లో తగ్గితే..ఒమిక్రాన్ రోగులకు 3 రోజుల్లో తగ్గిందని అధ్యయనంలో వెల్లడైంది. 


ఇక డెల్టా వేరియంట్(Delta Variant) బాధితుల్లో దాదాపు 60 శాతం మంది ఆసుపత్రుల్లో చేరగా.. ఒమిక్రాన్ బాధితుల్లో 41 శాతం మంది బాగానే ఉన్నారని తెలిసింది. ఇక డెల్టా బాధితుల్లో ఐసీయూలో చేరినవారు 30 శాతం కాగా, ఒమిక్రాన్ బాధితుల్లో కేవలం 18 శాతం మంది మాత్రమే ఐసీయూల్లో చేరారు. ఇక వెంటిలేటర్‌పై డెల్టా వేరియంట్ బాధితులు 12 శాతముంటే..ఒమిక్రాన్ బాధితులు కేవలం 1.6 శాతమే ఉన్నారని డాక్టర్ ఫహీమ్ యూనుస్ (Dr Faheem Younus) చెప్పారు. ఇక మరణాల రేటు డెల్టా వేరియంట్ బాధితుల్లో 29 శాతం కాగా, ఒమిక్రాన్ వేరియంట్‌లో 3 శాతముంది. అయితే ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారు.


డెల్టా, ఒమిక్రాన్ బాధితుల సగటు వయస్సు 36 -59 ఏళ్ల మధ్య ఉంది. ఒమిక్రాన్ (Omicron) గ్రూపుకు సంబంధించి సీక్వెన్సింగ్ డేటా ఇంకా అందుబాటులో రాలేదు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్ దేశాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో గత 24 గంటల్లో 27 వేల కరోనా కేసులు నమోదవగా ఒమిక్రాన్ కేసులు 1525 కు చేరకుంది. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అటు అమెరికా, రష్యా, పోలండ్ దేశాల్లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.


Also read: China Fire Accident: అండర్‌గ్రౌండ్‌లో అగ్నిప్రమాదం... 9 మంది సజీవదహనం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook