work from home: శాన్‌‌ఫ్రాన్సిస్కో : గూగుల్ కంపెనీ తమ సంస్థ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది.  కరోనావైరస్ వ్యాప్తి నివారణకు సోషల్ డిస్టన్సెంగ్ ( Social distancing ) కీలకం కావడంతో ప్రస్తుతం వారికి ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని వచ్చే ఏడాది జూన్ చివరి వరకు పొడిగిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. సంస్థ సిబ్బందికి ఓ లేఖ రాసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ఆఫీసుకు రావాల్సిన అవసరం లేకుండా పనిచేసుకునే సౌలభ్యం ఉన్న వాళ్లకు వాల్యుంటరీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. తొలుత ఈ ఏడాది చివరి వరకే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పిన గూగుల్.. ఇప్పుడిలా నిర్ణయం తీసుకుందంటే,  కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus crisis ) ఇప్పుడప్పుడే ముగిసేది కాదనే ఉద్దేశమే అందుకు కారణమై ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Also read: Telegram: వాట్సాప్‌ని తలదన్నేలా టెలిగ్రామ్ కొత్త ఫీచర్స్


వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ ( WFH policy ) కొనసాగింపు విషయంలో మిగతా వ్యాపార దిగ్గజాలు కూడా గూగుల్ బాటలోనే పయణిస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. Also read: 47 Chinese apps: చైనాకు చెందిన మరో 47 క్లోన్ యాప్స్‌పై భారత్ నిషేధం