ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త. తమ వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు భద్రతను అందించడంలో భాగంగా గూగుల్ ప్లే‌స్టోర్ (Play Store) నుంచి 29 యాప్స్‌ (Google Removes 29 Apps)ను తొలగించింది. తొలగించిన యాప్‌లలో యాడ్‌వేర్ అనే వైరస్‌ను వైట్ ఓప్స్ సటోరి అనే ఇంటెలిజెన్స్ గ్రూప్ గుర్తించింది. ఫొటోలను ఎడిట్ చేసుకునేందుకు వాడే 29 రకాల యాండ్రాయిడ్ యాప్స్‌లో ఈ మాల్‌వేర్ వైరస్ ఉన్నట్లు గుర్తించిన గూగుల్ (29 Apps Removed from Play Store) వాటిని తొలగించింది. Favivir: రూ.59కే కరోనా ట్యాబ్లెట్.. నేటి నుంచి మార్కెట్లోకి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ యాప్స్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత చార్టర్ యూజ్‌బ్లర్ అనే కోడ్ పేరుతో ఈ యాడ్‌వేర్ వైరస్‌ను ప్రవేశపెడుతున్నారని గుర్తించారు. ఆ తర్వాత యాప్ ఫోన్ లాంచ్ ఐకాన్‌లో కనిపించదని, తద్వారా అన్‌ఇన్‌స్టాల్ చేయడం సాధ్యం కాదని భావించారు. కానీ ఇదివరకే 3.5 మిలియన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని.. వీటిని తక్షణమే తొలగించాలని సూచిస్తున్నారు.  Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే..


గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన 29 యాప్స్ జాబితా (Google Removed 29 Apps From Play Store)