Women stripping naked in balcony: దుబాయిలో సోమవారం కొంతమంది మహిళలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటో తెలుసా ? ఒక ఎత్తైన అపార్ట్‌మెంట్ బాల్కానీలో అందరికీ కనబడేలా నగ్నంగా నిలబడి పబ్లిక్‌కి ఫోజివ్వడమే. అది కూడా పట్టపగలే. వాళ్లు నిలబడి ఫోజిచ్చిన భవంతికి సమీపంలోనే ఉన్న మరో భవంతి నుంచి తీసిన ఫోటో ప్రకారం చూస్తే.. వాళ్లు నగ్నంగా నిలబడి ఉండగా, వారిని మరొకతను వారి పక్కనే నిలబడి వీడియోలు, ఫోటోలు తీస్తున్నాడు. అందుకే వారిని పబ్లిక్ న్యూసెన్స్ కింద అరెస్ట్ చేసినట్టు దుబాయ్ పోలీసులు (Dubai police) తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పబ్లిగ్గా వాళ్లు న్యూడ్‌గా ఫోజిచ్చిన (Nude pose) తీరు చూస్తోంటే.. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అనిపిస్తోందని దుబాయ్‌కి చెందిన 'ది నేషనల్' అనే పత్రిక పేర్కొంది. పబ్లిగ్గా కిస్ (Public kiss) పెట్టుకున్నందుకు, లైసెన్స్ లేకుండానే ఆల్కహాల్ తాగడం వంటి నేరాలకు పాల్పడినందుకు గతంలో అనేక మందిని అరెస్ట్ చేసిన చరిత్ర ఉన్న దుబాయ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అక్కడి స్థానికులను సైతం నివ్వెరపోయేలా చేసింది. 


Also read : Night curfew in Delhi: ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ.. ఏమేం అనుమతిస్తారంటే..


ఈ ఘటనపై దుబాయ్ పోలీసులు స్పందిస్తూ.. ఇలాంటి పనులను దుబాయ్ సమాజం హర్షించదని, దుబాయ్ మహిళల సంస్కృతి, సంప్రదాయలకు విరుద్ధంగా ప్రవర్తించిన సదరు మహిళలకు 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు 1000 ధీరమ్స్ వరకు జరిమానా పడుతుందని అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి పొరుగునే ఉన్న దేశాలతో పోల్చుకుంటే.. యూఏఈలోనే కాస్త స్వేచ్ఛపూరిత వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కానీ సామాజిక పద్ధతులు, సోషల్ మీడియా విషయంలో మాత్రం అక్కడ కఠినమైన ఆంక్షలే ఉన్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook