US SHOOTING: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. వరుస కాల్పుల ఘటనలు యూఎస్ఏను వణికిస్తున్నాయి. స్కూల్ లో చొరబడి దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో 19 మంది విద్యార్థులు సహా 21 మంది చనిపోయిన ఘటన మరవకముందో మరోసారి కాల్పుల మోత మోగింది. ఓక్లహోమాలో ఓ యువకుడు స్థానికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులతో షాకైన జనాలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక మహిళ మరణించింది. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. ఓక్లహోమా లోని ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ లో ఈ కాల్పుల ఘటన జరిగింది. తుల్సాకు ఆగ్నేయంగా ఉన్న టాఫ్ట్ సమీపంలో మమోరియల్ డేను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు జనాలు భారీగా హాజరయ్యారు. దాదాపు 15 వందల పాల్గొన్న ఫెస్టివల్ లో గొడవ జరిగింది. అది కాస్త ముదిరింది. ఇంతలోనే ఓ యువకుడు రెచ్చిపోయాడు. చేతిలో తుపాకి పట్టుకుని ఫైర్ చేశాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. చిన్నారి సహా  ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఫెస్టివల్ కు వచ్చిన జనాలు షాకయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో పరుగులు తీయడంతో కొందరు కిందపడి గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని 26 ఏళ్ల  స్కైలర్ బక్నర్ గా గుర్తించారు. ఫైర్ చేసిన తర్వాత స్పాట్ నుంచి పారిపోయాడు బక్నర్. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే దుండగురు పోలీసుల ముందు లొంగిపోయాడని తెలుస్తోంది.


వారం రోజుల క్రితమే టెక్సాస్‌లోని ఓ స్కూల్ లో 18 సంవత్సరాల యువకుడు  కాల్పులు జరిపాడు. ఈ  ఘటనలో 19 మంది విద్యార్థులు చనిపోయారు. మరో ఇద్దరు స్కూల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో బార్డర్ లోని ఉవాల్డే నగరంలో ఈ దారుణ ఘటన జరిగింది. కిరాతకుడు సాల్వేడర్ రామోస్ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. 


READ ALSO:Mahesh Babu: సినిమా టికెట్ కోసం క్యూలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, వీడియో వైరల్


READ ALSO: Malla Reedy On Revanth Reddy: రేవంత్ రెడ్డి గూండాలే నన్ను చంపాలని చూశారు.. మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook