Major Movie Promotion: సినిమా టికెట్ కోసం క్యూలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, వీడియో వైరల్

Major Movie Promotions: మేజర్ మూవీని వినూత్న రీతిలో ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి మూవీని వినూత్నంగా ప్రమోట్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 10:14 AM IST
Major Movie Promotion: సినిమా టికెట్ కోసం క్యూలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, వీడియో వైరల్

Major Movie Promotions: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏంటి? సినిమా టిక్కెట్లు కోసం లైన్ల నిలబడటం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా...ఇది నిజమే.  ఆయన ‘తన 'సర్కారు వారి పాట' సినిమా చూడ్డానికో, మరో చిత్రాన్ని చూడటానికో అలా చేయలేదు. మహేశ్ నిర్మించిన ‘మేజర్‌’ (Major) మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన ఓ థియేటర్‌ ముందు క్యూలో నిలబడి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. యూట్యూబర్‌, డిజిటల్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌ఎం (Niharika NM)తో కలిసి సూపర్ స్టార్ వినూత్నంగా మూవీని ప్రమోట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. 

వీడియో ఓపెన్ చేస్తే.. నిహారిక సినిమా టికెట్‌ కోసం లైన్‌లో నిలబడుతుంది. ఇంతలో ఆమె ముందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. మధ్యలో మూవీ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) రాగానే వారిద్ధరి మధ్య గొడవ జరుగుతుంది. ఈలోపు నిహారిక ముందు మహేశ్‌బాబు (Mahesh Babu) వచ్చి క్యూలో నిలబడతారు. '‘మా  ఫ్రెండ్స్ ను కూడా పిలవొచ్చా'’ అని మహేశ్‌ అడగ్గానే..ఆమె ఓకే అంటుంది. ఫోన్ నంబర్ అడిగే లోపు సూపర్ స్టార్ వెళ్లిపోవడంతో నిహారిక  అసహనం వ్యక్తం చేస్తుంది. దీంతో వీడియో ఎండ్ అవుతుంది. 

అడివి శేష్ హీరోగా డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న చిత్రం 'మేజర్'. ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన  మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా ఈ మూవీ రూపొందుతుంది. ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌  సంస్థలతో కలిసి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్‌ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 3న విడుదల కానుంది. ఈ మూవీని  తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. 

Also Read: మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్‌డేట్... డ్యూయల్ రోల్‌లో కనిపించనున్న సూపర్ స్టార్..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News