Kamala harris: మళ్లీ ఉలిక్కి పడిన అమెరికా.. కమలా హారిస్ కార్యాలయంపై దుండగుల బుల్లెట్ల వర్షం..
Kamala Harris: అమెరికా మరోసారి కాల్పులతో అట్టుడికి పోయింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పార్టీ ఆఫీసుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Gunshots fired at kamala harris campaign office in Arizona: అమెరికాలో కాల్పుల కల్లోలం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికలు సమీపిస్తున్నకోలది.. కాల్పుల ఘటనలు యూఎస్ ప్రజల్ని ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ పై రెండు మార్లు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, కమలా పార్టీ ఆఫీస్ పైన కూడా.. గుర్తు తెలియని దుండగలు అర్ధరాత్రి తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు.
అమెరికా పోలీసులు ప్రకారం.. అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై రాత్రిపూట కాల్పులకు తెగబడ్డారు.దీంతో అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. కమలా వ్యక్తిగత సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని కాల్పులపై ఆరాతీశారు. అదే విధంగా కార్యాలయంలో ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిపోయినట్లు కూడా తెలుస్తోంది.
ఇటీవల ట్రంప్.. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో గోల్ఫ్ ఆడుతుండగా.. కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు రెండు నెలల క్రితం.. పెన్సీల్వేనియాలో.. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా కూడా.. పబ్లిక్ గా ఆయనపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో.. పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే కాల్చి చంపారు. ఈ ఘటనలో ట్రంప్ కుడిచెవి భాగం నుంచి తూటా దూసుకెళ్లింది.
తాజాగా, కమలా హారిస్ ప్రచార కార్యలయం మీద కాల్పులు జరగడం మాత్రం అమెరికాలో హైటెన్షన్ మారిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం కాల్పుల జరిపిన దుండగుల వేటలో అమెరికా పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికల బరిలో.. . డెమోక్రటిక్ అభ్యర్థి.. కమలా హారిస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్ కు మరోసారి చర్చలకు కూడా ఆమె ఆహ్వానించారు. దీంతో ప్రస్తుతం కమలా ట్రంప్ ల మధ్య మాత్రం రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పుకొవచ్చు.
ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో కూడా.. కమలా హరీస్ ముందజంలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ట్రంప్.. కమల వ్యక్తిగత జీవితంపై కూడా అనేక సందర్బాలలో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తు రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులపై కాల్పుల ఘటనలు మాత్రం వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది మాత్రం.. ఈ వరుస కాల్పుల ఘటనలపై డౌటానుమానం వ్యక్తం చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.