H1B Visa News: Huge Relief For Spouses of H-1B Workers: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగ‌స్వాముల‌కు అమెరికాలోనే ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించారు. గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త హెచ్1-బీ నిబంధనలను కొత్త అధ్యక్షుడు బైడెన్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుని భారీ ఊరట కల్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గత నాలుగేళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్న హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగ‌స్వాముల‌కు అమెరికాలో ఉద్యోగం చేసుకునే హక్కును తిరిగి అందించారు నూతన అధ్యక్షుడు జో బైడెన్. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బరాక్ ఒబామా తొలిసారిగా హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములు(H1B Visa News Update) అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడం తెలిసిందే. 


Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI



డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్షుడుగా ఉన్న సమయంలో హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు షాకిచ్చారు. హెచ్‌-4 డిపెండెంట్ వీసాదారులు అమెరికాలో జాబ్ చేసుకునేందుకు అవకాశం లేదని, ఒకవేళ వీరు అక్కడ ఉద్యోగం చేయాలంటే అతి తక్కువ జీతభత్యాలను అందుకునేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ట్రంప్. 


Also Read: AP Panchayat Elections: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అర్హులు, అనర్హులు వీరే



తాజాగా నూతన అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆ ఆంక్షలను ఎత్తివేయడంతో భారత్, చైనా సంతతికి చెందిన వారు ఊరట పొందారు. అమెరికాలో ఉన్న ప్రవాసులలో అధిక మొత్తంలో భారత్, చైనా వారే ఉండటం గమనార్హం. ముఖ్యంగా 2017 నుంచి హెచ్4 వర్క్ పర్మిట్ వీసా ఉన్న వారికి ఇబ్బంది మొదలైంది. అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఇతర దేశాల వారిని వారి సొంత దేశాలను పంపేందుకు డొనాల్డ్ ట్రంప్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.


Also Read: Jio Recharge Plans: మీకు అధికంగా డేటా కావాలా, Reliance Jio 5 బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే



చట్ట ప్రకారం వారి హక్కులను కాలరాసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తాజాగా జో బైడెన్ హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో జాబ్ చేసుకునేందుకు ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడంపై హర్షం వ్యక్తమవుతోంది.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook