Hamas chief Ismail Haniyeh Killed: హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే (61) హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని హనీయా ఇంటిపై జరిగిన దాడిలో హతమైనట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ బృందం వెల్లడించింది. తుపాకీ కాల్పుల్లో హనియే హతమైనట్లు సమాచారం. హనియే బాడీ గార్డ్ కూడా హత్యకు గురయ్యాడు. ఇస్మాయిల్ హనియే 2017 నుంచి హమాస్‌కు నాయకుడిగా ఉన్నాడు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెసాష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా హనియే టెహ్రాన్ చేరుకున్నాడు. హనియే మృతికి ఇస్లామిక్ వర్గం సంతాపం తెలిపింది. అయితే హనియే హత్యకు బాధ్యులెవరనేది ఇంకా తేలలేదు. ఇజ్రాయెల్ హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ అధికారికంగా ప్రకటించలేదు. హమాస్ నాయకులను హతమారుస్తామని గతంలోనే ఇజ్రాయిల్ శపథం చేసిన సంగతి తెలిసిందే. పక్కా స్కెచ్‌తో హనియేను హత్య చేసినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Raj Tarun: లావణ్యతో శేఖర్ బాషాకు ఉన్న లింకేంటి.. ? రాజ్ తరుణ్ ఎందుకు సైడ్ అయ్యాడు..


హనియే మరణం కూట్రపూరిత చర్య అంటూ హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో సభ్యుడు ముసా అబు మర్జుక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బదులు తప్పదని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలోనే తమ నాయకుడు మరణించాడని హమాస్‌ ఆరోపిస్తోంది. ఈ హత్య ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌ తీవ్రంగా ఖండించారు. హనియే మరణం గురించి అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమాచారం తెలుసుకుంది. ఈ విషయంపై ఇజ్రాయిల్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. 


1963లో గాజా సిటీకి సమీపంలోని ఓ శరణార్థి శిబిరంలో హనియా జన్మించగా.. తొలి ఇంతిఫాదా సమయంలో హమాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హమాస్‌ వ్యవస్థాపకుడు అహ్మద్‌ యాసిన్‌కు కుడి భుజంగా ఉంటూ.. రాజకీయపరమైన సలహాలు ఇచ్చేవాడు. హామాస్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక ర్యాంక్‌ల్లో పనిచేశాడు. 2004లో ఇజ్రాయెల్‌ దాడుల్లో అహ్మద్‌ యాసిన్ హత్యకు గురైన తరువాత హమాస్‌లో కీలక పాత్ర పోషించాడు. 2006లో పాలస్తీనా స్టేట్‌ ప్రధానిగా గాజా పట్టీని పరిపాలించాడు.


అయితే 2007లో ఆ పదవి నుంచి హనియేను పాలస్తీనా నేషనల్‌ అథారిటీ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ తొలగించడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి గాజాలో ఫతా-హమాస్‌ మధ్య యుద్ధం జరుగుతోంది.  అబ్బాస్ ఆదేశాలను పక్కనపెట్టి గాజా పట్టీకి ప్రధానిగా వ్యహరించాడు. 2017లో హామాస్ చీఫ్‌గా ఎన్నికవ్వగా.. ఆ తరువాత అమెరికా ప్రపంచ ఉగ్రవాదుల లిస్ట్‌లో చేర్చింది. 2019లో గాజా పట్టీని వీడిన హనియే.. ఖతర్‌లో నివాసం ఉంటున్నాడు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై.. టెహ్రాన్‌లో ఉండగా హత్యకు గురయ్యాడు.


Also Read: Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.