Heart Breaking: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. లక్ష్యం చేరేవరకు యుద్ధం ఆపేదే లేదని రష్యా.. వెనక్కి తగ్గబోయేదే లేదని ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం వలన ఇరు దేశాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రష్యాపై కొన్ని దేశాలు ఆంక్షలు విధించగా దిగుమతులు తగ్గిన కారణంగా రష్యన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనబడుతున్నాయి. రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలు.. రష్యా సేనల దాడుల్లో నామరూపాలు లేకుండా శిథిలమైన భవనాలతో భయానక వాతావరణం నెలకొంది. పౌరలను సైతం రష్యా సైన్యం విడిచిపెట్టడం లేదు. కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చిపారేస్తోంది. దాంతో తూటాలకు చిధ్రమైన మృతదేహాలతో నగర వీధులు మరుభూమిని తలపిస్తున్నాయి. ఇంతట దారుణమైన పరిస్థితుల్లోనూ ఓ పెంపుడు శునకం తన యజమాని పట్ల విశ్వాసం చూపించింది. 


రష్యా బలగాల దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్డుపైన మరణించాడు. తన యజమాని మృతదేహం రోడ్డుపక్కన పడి ఉండటంతో అతడి పెంపుడు శునకం అక్కడే కూర్చుని మౌనంగా రోదించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్‌లో జరిగిన ఈ సంఘటన 1930 నాటి జపాన్ కుక్క హచికో ఉదంతాన్ని గుర్తు చేస్తోంది. రోజూ లాగే ఉద్యోగానికి వెళ్లిన తన యజమాని తిరిగి వస్తాడని ఆ శునకం ఎదురు చూసింది. తన యజమాని చనిపోయాడని తెలియక అలా 9 ఏళ్లు నిరీక్షించింది. చివరకు అక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై అనేక భాషల్లో సినిమాలు సైతం వచ్చాయి. ఉక్రెయిన్‌ లో జరిగిన తాజా ఘటన సైతం హృదయాలను పిండేస్తోంది.


Also Read: Viral Video: కన్న కొడుకుకి స్తంభానికి కట్టేసి.. కంట్లో కారం చల్లిన తల్లి! ఎందుకో తెలుసా?


Also Read: Mouni Roy Photos: పెళ్లి తర్వాత మరింత సన్నబడిన 'నాగిని' మౌనీరాయ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook