America Heavy Rains: అగ్రరాజ్యం అమెరికాను ప్రకృతి భయపెడుతోంది. భారీ వర్షాలు, వరదలతో అమెరికా దేశం అతలాకుతలమవుతోంది. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. వరద పోటు అగ్రరాజ్యానికి సవాలుగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాను భారీ వర్షాలు(Heavy Rains) బెంబేలెత్తిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా అమెరికాలో కురుస్తున్న భారీ వర్షాలతో దేశం వణికిపోతోంది. నదులు, వాగులు వరద ఉధృతితో పోటెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెన్నెస్సీ నగరం కుదేలైపోయింది. వరదలో వందలాది కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. చాలమంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇప్పటి వరకూ 22 గా అంచనా వేస్తున్నా..మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రకృతి ప్రకోపంతో అమెరికా గజగజలాడుతోంది. ఊర్లలో వరద నీరు నిండిపోయింది. వందేళ్ల అమెరికా చరిత్రలో(Heavy rains in America)ఇవే అత్యంత భారీ వర్షాలని చెబుతున్నారు అధికారులు.టెన్నెస్సీలోని హంప్రీకౌంటీలో గత 24 గంటల్లో 43 సెంటీమీటర్ల వర్షం నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 


Also read: Panjshir Army: తాలిబన్లకు ఆ లోయలో ఎదురు దెబ్బ, 3 వందలమంది తాలిబన్లు హతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook