Heavy Rains in Dubai: నిత్యం రోళ్లు పగిలే ఎండలతో వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లే ఎడారి దేశాన్ని అకాల భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నిన్న బలమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ముంచెత్తాయి. చాలా ప్రాంతాలు నీట మునగడంతో జనజీవనం స్థంబించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో రోడ్లు, ఇళ్లు, మాల్స్, ఎయిర్‌పోర్ట్స్ అన్నీ జలమయమయ్యాయి. హోటల్స్‌లో నీళ్లు ప్రవేశించాయి. రోడ్లపై జనం స్పీడ్ బోట్లలో తీరుగుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన భారీ వర్షం నిన్న ఉదయం వరకూ కొనసాగింది. ఏడాదిలో కురవాల్సిన వర్షపాతం దుబాయ్‌లో ఒక్కరోజులోనే కురిసింది. గత 75 ఏళ్ల చరిత్రలో ఏడారి దేశంలో ఇదే అతి పెద్ద భారీ వర్షాలుగా పరిగణిస్తున్నారు.



ఇప్పటికే ఎడాది దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా 18 మంది మరణించారు. రానున్న 48 గంటల్లో వాతావరణం మరింత అస్థిరంగా ఉండవచ్చని అంచనా.  రానున్న 48 గంటల్లో అబూదాబి, షార్జా, దుబాయ్, ఎమిరేట్స్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు వడగళ్లు పడే అవకాశాలున్నాయి. వాహనాల్ని ఎత్తైన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలని సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ను చాలాసేపటి వరకూ మూసివేశారు. అటు మెట్రో రైల్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.



చాలామంది ప్రజలు దుబాయ్ మాల్‌లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా స్కూళ్లు మూసివేశారు. కేవలం 24 గంటసల వ్యవధిలో 160 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్టు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా దుబాయ్ విమానాశ్రయం రన్ వేపై కూడా నీరు చేరుకుంది. దుబాయ్‌లో 142 మిల్లీమీటర్ల వర్షపాతం, ఎమిరేట్ ఆఫ్ పుజైరాలో 145 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.



Also read: AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook