రష్యాతో యుద్ధంతో అతలాకుతలమౌతున్న ఉక్రెయిన్‌లో మరో పెను దుర్ఘటన చోటుచేసుకుంది. ఘోర  ప్రమాదం జరిగింది. కీవ్ నగరంలోని బ్రోవరీ టౌన్ కిండర్‌గార్టెన్ సమీపంలో హెలీకాప్టర్ కుప్పకూలి ఏకంగా 18 మంది దుర్మరణం చెందారు. హెలీకాప్టర్ దుర్ఘటనలో మరణించినవారిలో ఆ దేశపు హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రి, విదేశాంగమంత్రి సహా పలువురు ఇతర మంత్రులున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోంశాఖ మంత్రి డేనిస్ మోనాస్థిరిస్కీ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. జనావాసాల మధ్య హెలీకాప్టర్ కూలడంతో ప్రాణనష్టం పెరిగిందని తెలుస్తోంది. దుర్ఘటనలో గాయపడిన 15 మంది పిల్లలు సహా 29 మందికి చికిత్స అందిస్తున్నారు. హెలీకాప్టర్ కూలిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పక్కనున్న బిల్డింగులకు మంటలు అంటుకున్నాయి. ప్రమాద ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం వెనుక రష్యా హస్తముందనే విషయాన్ని ఉక్రెయిన్ ఇంకా ధృవీకరించలేదు. పూర్తి జనావాసాల మధ్య కూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత ఒక అత్యంత సీనియర్ మంత్రి మరణించడం ఇదే కావడం గమనార్హం. 


Also read: Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook