Historical Bowl: మన కిచెన్‌లో కన్పించే పింగాణీ బౌల్ ధర ఎంత ఉండవచ్చు..మహా అయితే 2-3 వేలుంటుందేమో. అంతే కదా.  కానీ వేలానికొచ్చిన ఆ పింగాణీ బౌల్ ధర ఎంతో తెలుసా..అక్షరాలా 3.6 కోట్లు. నమ్మలేకపోతున్నారా..నిజమే. ప్రత్యేకతలివీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాంటిక్ వస్తువులకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. వాటిని సేకరించాలనుకునే అభిరుచి ఉన్నవారికే వాటి విలువ తెలుస్తుంది. అదే కోవకు చెందుతుంది ఈ పింగాణీ బౌల్. మామూలుగా చూస్తే 2-3  వేలుంటుందేమో అనుకుంటాం. ఈ పింగాణీ బౌల్(Porcelain Bowl)ఇప్పుడు అమెరికాలో వేలానికొచ్చింది. ధర ఎంతో తెలుసా. కేవలం 3.6 కోట్లు మాత్రమే. వేలంపాట నిర్వాహకుల అంచనా మాత్రమే ఇది. వేలంలో ఇంకా ఎక్కువకు కూడా వెళ్లవచ్చు. న్యూయార్క్‌లోని సోథేబీ కంపెనీ వేలంపాటలో ఈ బౌల్‌ను విక్రయించనుంది. దీని ప్రత్యేకతలేంటంటే..


కనెక్టికట్‌కు చెందిన ఓ పాత వస్తువుల వ్యాపారి గత యేడాది ఈ బౌల్‌ను 2 వేల 5 వందల రూపాయలకు కొనుగోలు చేశాడు. కొద్దికాలం తన దగ్గరే ఉంచుకున్నాక..ఆ బౌల్‌లో ఎదో ప్రత్యేకత ఉందని భావించాడు. వెంటనే సోథేబీ కంపెనీని సంప్రదించి..ఆ బౌల్ చరిత్ర, విలువ చెప్పాలని కోరాడు. బౌల్‌ను పరిశీలించిన కంపెనీ సైతం ఖంగుతింది. ఎందుకంటే ఇది చాలా అరుదైన బౌల్. వేలం వేస్తే 5 లక్షల డాలర్ల వరకూ పలుకుతుందని కంపెనీ స్పష్టం చేసింది.  వాస్తవానికి ఇది చైనీస్ బౌల్( Chinese Bowl). క్రీస్తుశకం 1403 నుంచి 1424 వరకు చైనాను పాలించిన యోంగిల్ చక్రవర్తకి కాలం నాటిదట. ఇలాంటి కప్పులు మరో ఆరు మాత్రమే ప్రపంచంలో ఉన్నాయట. తైపీలోని నేషనల్ మ్యుజియంలో రెండు, లండన్ మ్యూజియంలో రెండు, టెహ్రాన్ మ్యూజియంలో రెండు ఉన్నాయి.


చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది ఈ బౌల్. 6 అంగుళాల తెల్లటి పాత్రకు లోపల, వెలుపలా నీలం రంగులో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల బొమ్మలున్నాయి. పట్టుకుంటే చాలు సున్నితంగా అన్పిస్తోంది. 15వ శతాబ్దపు రంగులు, డిజైన్లు స్పష్టంగా కన్పిస్తున్నాయి.  పాత్ర పెయింటింగ్, షేప్  చాలా యూనిక్‌గా ఉందని సోథేబీ కంపెనీ అంటోంది. ఇంతటి పురాతన వస్తువు..ఆ వ్యాపారి వద్దకు ఎలా వచ్చిందనేది అర్ధం కావడం లేదట. తరతరాలుగా చేతులు మారుతూ ఇక్కడికి చేరి ఉంటుందని..దాని  విలువ తెలియకపోవడంతో తక్కువ ధరకు అమ్మేసుకుని ఉంటారని కంపెనీ అనుకుంటోంది. న్యూయార్క్( New york) ‌లో ఈ నెల 17వ తేదీన ఈ బౌల్‌‌ను వేలంపాట( Chinese Bowl for Auction)లో విక్రయించనున్నారు. 


Also read: Twitter CEO Jack Dorsey: ట్విట్టర్ సీఈవో ఒక్క ట్వీట్ ఖరీదు రూ.18 కోట్ల రూపాయలు, నోరెళ్లబెడుతున్న నెటిజన్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook