కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తాయిబా ఏర్పాటులో  కీలకంగా వ్యవహరించిన హఫీజ్ సయీద్ అంటే తనకెంతో ఇష్టమని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ వేర్పాటు వాదులకు సయీద్ ఎంతో  సహకరిస్తున్నాడని కితాబు ఇచ్చారు. తాను అధికారంలో ఉండగా సయీద్‌తో పలుమార్లు భేటీ అయ్యానని చెప్పుకున్నారు. భారత్ నుండి కాశ్మీర్‌ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న జమాత్ ఉద్ దావా, లష్కరే తాయిబా చర్యలను సమర్ధించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


జమ్మూ కాశ్మీర్ పై సైనిక చర్యకు నేను అనుకూలమే. కానీ.. భారత్ సైన్యం చాలా శక్తివంతమైంది. అంతర్జాతీయ దృష్టిలో లష్కరే తాయిబాను ఉగ్రసంస్థగా చిత్రీకరించడంలో భారత్ సఫలమైంది. కాశ్మీర్ లో లష్కరే తాయిబా సమర్ధవంతంగా పనిచేస్తుంది అని ఆయిన అన్నారు.