ఇస్లామాబాద్‌: న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సదస్సును ముగించుకొని పాకిస్తాన్‌కు చేరుకున్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి కశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''కశ్మీరీలు చేస్తోన్న పోరాటం ఓ పవిత్ర యుద్ధం(జిహాద్‌) అని పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్.. అందుకు మద్దతు పలుకుతూ పాకిస్థానీలు చేస్తున్నది కూడా జిహాదే అవుతుందని అన్నారు. ప్రపంచమంతా వ్యతిరేకించినా.. కశ్మీరీలకు అండగా మేముంటాం. కశ్మీరీల వైపు పాకిస్తానీయులు ఉంటే.. ఈ పోరాటంలో విజయం వారినే వరిస్తుంది" అంటూ కశ్మీరీలను, కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న వారిని ప్రోత్సహించేలా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడం గమనార్హం. 


అమెరికా నుంచి తిరిగొచ్చిన అనంతరం తొలిసారిగా ఆదివారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉగ్రవాదంపై మరోసారి అతడి వైఖరిని బయటపెట్టాయి