Srilanka Crisis: పాపం కరుణరత్నే, శ్రీలంక క్రికెటర్ కు ఎంత కష్టమొచ్చిందో తెలుసా..?
Srilanka Crisis: శ్రీలంక క్రికెటర్ చమికా కరుణరత్నేరెండు రోజులు క్యూలో నిల్చున్నాడు. అవును మీరు చదువుతున్నది నిజమే.. రెండు రోజులు క్యూలో ఉంటేనే తన కారులో కొన్ని లీటర్ల పెట్రోల్ పోయించుకోగలిగాడు.
Srilanka Crisis: శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ ప్రభావం ఇప్పుడు పరోక్షంగా లంక క్రికెటర్లపై కూడా పడుతోంది. ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకక.. ఎందరో ఆటగాళ్లు ప్రాక్టీస్ కు దూరంగా ఉంటున్నారు. గ్రౌండ్ వరకు వెళ్లాలంటే ట్రాన్స్‌పోర్టేషన్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు శ్రీలంక ఆటగాడు చమిక కారుణరత్నే. రెండు రోజుల పాటు క్యూలో నిల్చోని పెట్రోల్ సంపాధించుకున్నాడు. దొరికిన పది వేల రూపాయల పెట్రోల్ తో రెండు మూడు రోజుల వరకు ప్రాక్టీస్ కు వెళ్తానంటున్నాడు.
Cannot even go for cricket practice due to fuel crisis: SL cricketer Chamika Karunaratne
Read @ANI Story | https://t.co/rwVJ2FBYkV#ChamikaKarunarate #SriLanka #SriLankaCrisis pic.twitter.com/cEzn6TJMbm
ఆసియా కప్ 2022కు శ్రీలంకనే ఆతిధ్యం ఇవ్వనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను లంక క్రికెటర్లను కలవరపెడుతోంది. ఆసియా కప్ లో రాణించాలంటే కనీస ప్రాక్టీస్ ఎంతో అవసరం. అయితే లంక క్రికెటర్లు చాలా మంది కూడా పెట్రోల్, డీజిల్ కొరతతో గ్రౌండ్ లకు వెళ్లి ప్రాక్టీస్ కూడా చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆసియా కప్ వేదికను ఐసీసీ మారుస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే మ్యాచ్ లు జరిగే సమయంలో ఆటగాళ్లను మైదానాలకు తీసుకెళ్లడం.. హోటల్ కు తీసుకురావడం కోసం ఎంతగానో చమురు అవసరం పడుతుంది. అయితే దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుందని కరుణరత్నే ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ తమ ఫోకస్ అంతా ఆటమీదే పెడుతామన్నారు. అటు గొటబాయ రాజపక్స రాజీనామాపై కూడా ఆయన స్పందించాడు. గొటబాయ రాజీనామా తర్వాతైనా మంచి వ్యక్తులు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పాడు. శ్రీలంక ప్రజలకు కచ్చితంగా మంచి జరుగుతుందన్నాడు.
శ్రీలంకలో సంక్షోభం జరుగుతున్నప్పటికీ ఆస్ట్రేలియా జట్టు మాత్రం తన పర్యటనను కొనసాగించింది. టీట్వంటీ సిరీస్ ను ఆస్ట్రేలియా, వన్డే సిరీస్ ను శ్రీలంక గెలుచుకుంది. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో చెరో మ్యాచ్ గెలిచి ఇరు జట్లు డ్రా చేశాయి. ఇక కరుణరత్నే 2019లో అంతర్జాతీయ క్రికెట్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ తో పాటు 18 వన్డే, 25 టీట్వంటీ మ్యాచ్ లు ఆడాడు.
Also Read: Weight Loss Tips: కీరదోసకాయ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.