Telangana Rains:వామ్మో ఇవేం వానలు.. తెలంగాణలో 85 శాతం అధిక వర్షపాతం.. ఏడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్!

Telangana Rains:తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. పలు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. జూలై చరిత్రలోనే గతంలో ఎప్పుడు లేనంత వర్షం కురిసింది. గత 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా ముత్తారం మహజదేవ్ పూర్ లో 35 సెంటిమీటర్ల వర్షం కురిసింది ఇంటే వర్ష బీభత్సం ఎలా ఉందో ఊహించవచ్చు.

Written by - Srisailam | Last Updated : Jul 10, 2022, 01:16 PM IST
  • తెలంగాణలో కుండపోతగా వానలు
  • జూలై నెలలో రికార్డ్ స్థాయి వర్థం
  • 85 శాతం అధిక వర్షపాతం నమోదు
Telangana Rains:వామ్మో ఇవేం వానలు..  తెలంగాణలో 85 శాతం అధిక వర్షపాతం.. ఏడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్!

Telangana Rains:తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. పలు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. జూలై చరిత్రలోనే గతంలో ఎప్పుడు లేనంత వర్షం కురిసింది. గత 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవ్ పూర్ లో 35 సెంటిమీటర్ల వర్షం కురిసింది అంటే వర్ష బీభత్సం ఎలా ఉందో ఊహించవచ్చు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 8 జిల్లాలకు ఇవాళ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. తెలంగాణాలో వర్షపాతం ఇలానే నమోదు అయితే రానున్న 24 గంటల్లో పలు జిల్లాలో వరదలు సంభంవించే అవకాశం ఉందని తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జిల్లాల్లో వరద ప్రమాదం ఉంటుందని అంచనా వేసింది భారత వాతావరణ కేంద్రం.

జూలై 10వరకు వర్షపాతం గమనిస్తే తెలంగాణలో కురవాల్సిన దానికంటే 85 శాతం అధిక వర్షం కురిసింది. ఐఎండీ అంచనా ప్రకారం జూలై 10వరకు తెలంగాణలో సరాసరి వర్షపాతం 19.7 సెంటిమీటర్లు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 36.6 సెంటిమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ కురవాల్సిన దానికంటే ఎక్కువ వర్షమే కురిసింది. మహబూబా బాద్ జిల్లాలో ఏకంగా 126 శాతం అధిక వర్షం కురవగా.. భూపాలపల్లి జిల్లాలో 122 శాతం అధిక వర్షం కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, భద్రాది కొత్తగూడెం జిల్లాలో కురవాల్సిన దాని కంటే డబుల్ వర్షం కురిసింది. ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు వంద శాతం అధిక వర్షం కురిసింది. మిగితా జిల్లాల్లోనూ కురవాల్సిన దాని కంటే 50 నుంచి 90 శాతం వరకు ఎక్కువ వర్షం కురిసింది. హైదరాబాద్ జిల్లానే చివరి స్థానంలో ఉంది. హైదరాబాద్ లో ఈపాటికి కురవాల్సిన వర్షం కుంటే 41 శాతం అధిక వర్షం కురిసింది.  

జూలై నెలలో ఎప్పుడు ఈ స్థాయిలో వర్షాలు కురవలేదంటున్నారు. జూలై రెండో వారంలోనే ఎస్సారెస్పీ నిండుకుండలా మారిపోయింది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సోమవారం ఎస్సారెస్పీ గేట్లు తెరిచే అవకాశం ఉంది. జూలై రెండో వారంలోనే ఎస్సారెస్పా గేట్లు ఎత్తడం రికార్డ్ అంటున్నారు. అటు భద్రాచలం దగ్గర గోదావరి వరద క్రమంగా పెరిగిపోతుంది. ఆదివారం రాత్రికి నీటిమట్టం 43 అడుగులకు చేరుతుందని సీడబ్ల్యూసీ అలెర్ట్ చేసింది. రాత్రికి భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఈమధ్య కాలంలో ఎప్పుడు లేనట్లుగా జూలై రెండో వారంలోనే నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తోంది. 

Read also: Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!

Read also: KCR VS ETELA RAJENDER:గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ.. బెంగాల్ సీన్ రిపీటయ్యేనా?  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News