India-Japan: రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం
ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ - జపాన్ దేశాలు రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సామరస్యం వెల్లివిరుస్తుందని ఇరుదేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఇండో పసిఫిక్ ప్రాంతం ( Indo pacific region ) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ - జపాన్ దేశాలు రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సామరస్యం వెల్లివిరుస్తుందని ఇరుదేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
భారత, జపాన్ ( India and japan ) ల మధ్య కీలకమైన చారిత్రాత్మక రక్షణ ఒప్పందం ( Defence agreement ) జరిగింది. రెండు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ రక్షణ ఒప్పందం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సామరస్యం వెల్లివిరియడమే కాకుండా..రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కానున్నాయి. ఈ ఒప్పందం నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ..జపాన్ ప్రధాని అబే షింజోతో ఫోన్ లో సంప్రదింపులు జరిపారు. రక్షణ ఒప్పందంపై ఇరుదేశాల నేతలు అంగీకారం తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై రెండు దేశాల మధ్య రక్షణ పరికరాలు, సేవల మార్పిడి జరుగుతుంది.
రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చొరవ చూపారంటూ షింజో అబేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra modi ) ప్రశంసించారు. ఇరువురు నేతలు ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు సహా ఇరు దేశాల మధ్య సహకారంపై సమీక్షించారు. Also read: NASA: వాణిజ్య స్పేస్ క్రాఫ్ట్ కు కల్పనా చావ్లా పేరు